స్వేద పత్రం రిలీజ్ చేసిన బీఆర్ఎస్.

స్వేద పత్రం రిలీజ్ చేసిన బీఆర్ఎస్.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల
.కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పుల తడక: కేటీఆర్
కేసీఆర్ బీఆర్‌ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించింది :కేటీఆర్
హైదరాబాద్ డిసెంబర్ 24:తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే దానికి కౌంటర్‌గా ఇవాళ బీఆర్ఎస్ స్వేద పత్రం రిలీజ్ చేసింది.తెలంగాణ భవన్‌లో స్వేద పత్రం విడుదల చేసిన పార్టీ కార్యనిర్వహక అధ్య క్షుడు కేటీఆర్ గత ప్రభుత్వ హయంలో చేసిన అభివృద్ధి వచ్చిన మార్పు లను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివ రించారు.కాంగ్రెస్ ప్రభుత్వం రిలీజ్ చేసిన శ్వేతపత్రం తప్పుల తడక అని కేసీఆర్ బీఆర్‌ఎస్ పాలనపై కాంగ్రెస్ ప్రభుత్వం బురదజల్లేందుకు ప్రయత్నించిందని కేటీఆర్ మండిపడ్డారు గత తొమ్మి దిన్నరేళ్ల కేసీఆర్ సుపరి పాలనను బద్నాం చేసే విధంగా ప్రజల్లో అపోహలు అనుమానాలు సృష్టించే విధంగా బురద చల్లే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు.
శాసనసభలో తమగొంతు నొక్కే ప్రయత్నం చేశారని అందుకే వాస్తవాలు ప్రజలకు తెలియాలనే ఉద్దేశ్యంతో స్వేదపత్రం రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు.గత పదేళ్లు చమటోడ్చి, రక్తాన్ని రంగరించి వందల, వేల గంటలు పనిచేసి ఒక్క మా ప్రభుత్వంలోని మంత్రు లు,ఎమ్మెల్యేలు, సీఎం మాత్రమే కాదు లక్షల మంది ఉద్యోగులు,కోట్ల మంది ప్రజలు తమ స్వేదంతో తమ కష్టంతో ఈ రాష్ట్ర అభ్యున్నతికి తోడ్పడ్డారో ఏ రకంగా ముందుకు తీసుకెళ్లారో చెప్పాల్సిన బాధ్యత ఈ స్వేదపత్రం ద్వారా మా మీద ఉందన్నారు.ఎక్కడికి చేరుకున్నమో తెలియాలి అంటే ఎక్కడ మొదలయ్యామో కూడా గుర్తుపెట్టుకోవాలి అందుకే ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం నుంచి వికాసం వైపు సంక్షోభం వైపు నుంచి సమృద్ధి వైపు జరిగిన ఈ ప్రయాణం.కొత్త రాష్ట్రంలో గత పదేళ్ల ప్రగతి ప్రస్థానం ఏదైతే ఉందో భారతదేశ చరిత్ర లోనే ఇది ఒక సువర్ణ అధ్యాయం 60 సమైక్య పాలన 60 ఏళ్లలో జరిగిన జీవన విధ్వంసం ఒకవైపు అయితే మరి నేరపూరిత నిర్లక్ష్యంతో ఉద్దేశ పూర్వకమైన నిర్ల క్ష్యంతో మన రాష్ట్రాన్ని నాశనం చేసే జీవన విధ్వంసం చేసే ప్రయత్నం అప్పటి పాలకులు చేశారు అని కేటీఆర్ అన్నారు.రాష్ట్రం ఏర్పడిన తొలి నాళ్లలో ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయని కేటీఆర్ తెలిపారు కొందరు ఎమ్మె ల్యేలను కొనుగోలు చేసేం దుకు ప్రయత్నించారని విమర్శించారు రాష్ట్ర స్థూల రుణం రూ.3.17 లక్షల కోట్లు దీన్ని కాంగ్రెస్ నేతలు రూ.6.70 లక్షల కోట్లుగా చూపించే ప్రయత్నం చేశారని ఆరోపించారు.