సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం

సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.

పీడిత వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితమంతా కృషి చేసిన తెలంగాణ మట్టి బిడ్డ సురవరం, కమ్యూనిస్టు ఉద్యమంలో అగ్రగామి పాత్ర పోషించి, మార్క్సిస్టు ప్రజానేతగా గొప్ప పేరు సంపాదించుకున్నారని కేసీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వారితో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

శోకసంతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ హృదయపూర్వక సానుభూతి తెలిపారు.

You may also like...

Translate »