ఘనంగా పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవాల రక్తదాన శిభిరం

జ్ఞాన తెలంగాణ,జనగామ జిల్లా,అక్టోబర్ 27 :స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పట్టణ కేంద్రంలో వరంగల్ జిల్లా సిపి సన్ ప్రీత్ సింగ్ గారి ఆదేశాల మేరకు స్టేషన్ ఘనపూర్ ఏసీబీ బీమ్ శర్మ గారి ఆధ్వర్యంలో స్టేషన్గన్పూర్ మహా గార్డెన్ ఫంక్షన్ హాల్ లో పోలీసుల అమరవీరుల స్మారక దినోత్సవాల రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమాన్ని సిఐ వేణు గారు ముఖ్య భూమిక పోషించి ఈ రక్తదాన శిబిరాన్ని అందరి యువకులతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇసురం శ్రీనివాస్ స్వేరోస్ ఇంటర్నేషనల్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మరియు గాదే శ్రీధర్ ఎమ్మార్పీఎస్ స్టేషన్గన్పూర్ మండల ఇన్చార్జి గారు , ఎడ్ల మహిపాల్ బి ఆర్ ఎస్ చిల్పూర్ మండల నాయకులు, ఎమ్మార్పీఎస్ స్టేషన్ ఘనపూర్ మండల అధ్యక్షులు గుర్రం నవీన్ గారు,ఎమ్మార్పీఎస్ జనగామ జిల్లా ఉపాధ్యక్షులు గుర్రం అశోక్ గారు, తదితరులు పాల్గొని రక్త దానం చేశారు. ఈ సందర్భంగా స్టేషన్ ఘన్పూర్ ఎస్సై రాజేష్ గారు మరియు ఎస్సై మనిషా గారు రక్తదానం చేసిన వారిని అభినందించారు

You may also like...

Translate »