బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం

బీజేపీ నూతన స్టేట్ కౌన్సిల్ మెంబర్ బసగల రాములు గౌడ్ కు గౌరవ సత్కారం
- శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన పార్టీ నేతలు
- బీజేపీ బలోపేతంలో కొత్త శక్తిని తీసుకువచ్చే నాయకత్వం
జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి ప్రతినిధి:
భారతీయ జనతా పార్టీ నూతనంగా స్టేట్ కౌన్సిల్ మెంబర్గా ఎన్నికైన శ్రీ బసగల రాములు గౌడ్ గారిని బుధవారం వారి నివాసంలో , బీజేపీ చేవెళ్ల మండల అధ్యక్షులు అత్తిలి అనంతరెడ్డి, శంకర్పల్లి మండల అధ్యక్షులు లీలావతి బయానంద్, బీజేపీ యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి, సీనియర్ నాయకులు ఎల్. ప్రభాకర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ సభ్యులు వాసుదేవ్ కన్నా, శంకర్పల్లి మున్సిపల్ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, బీజేవైఎం జిల్లా కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి తదితరులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, “శ్రీ బసగల రాములు గౌడ్ నాయకత్వం బీజేపీకి మరింత బలం తెచ్చిపెడుతుంది. ఆయన అనుభవం, కార్యాచరణ పార్టీ విస్తరణకు దోహదపడుతుంది” అని అభిప్రాయపడ్డారు. పార్టీ నిర్మాణంలో, ప్రజల సమస్యల పరిష్కారంలో ఆయన మరింత శక్తివంతంగా పని చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల మాజీ కార్యదర్శి మున్నూరు శ్రీకాంత్, ఏఎంసీ మాజీ అధ్యక్షులు పరమేశ్వర్ రెడ్డి, న్యాయవాది చేకూరి ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, భార్గవ్ రెడ్డి, జయసింహా రెడ్డి, దండు రామ్మోహన్, ప్రవీణ్, గాజులగూడెం నరసింహ, దళిత మోర్చా మాజీ అధ్యక్షులు గాలయ్య, ఎంకేపల్లి గ్రామ అధ్యక్షులు టీ. కరుణాకర్ గౌడ్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు