జ్ఞానతెలంగాణ,నిర్మల్: మన్య శ్రీ కాన్షిరాం , మహాత్మ జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకొని ప్రారంభించి మార్చి 15 నుంచి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ 14వ తేదీ వరకు ఈ దీక్ష నెల రోజుల పాటు కొనసాగుతుంది. దీక్ష స్వీకరించే వారు సాధ్యమైనంత వరకు తెల్లని దుస్తులు ధరించాలని, ఈ నెల రోజుల పాటు మంసాహరానికి , మద్యపానానికి,దూరంగా ఉండాలి . ప్రతిరోజు ఉధయం 5:00 గం లకు లేచి ధ్యానం ,నడక, వ్యాయామం, యోగా వంటివి చేయాలి.బహుజన మేధావుల, మహానుభావుల జీవిత చరిత్రను చదువుతూ ఈ జ్ఞానాన్ని సమ సమాజ నిర్మాణంలో బడుగు బలహీన వర్గాల వారందరికీ మహానుభావుల యొక్క గొప్పతనాన్ని, జ్ఞాన సంపదను పరిచయం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ జ్ఞాన దీక్షను తిమ్మాపూర్ గ్రామంలో BSI సెంట్రల్ టీచర్ బుద్దాచర్య , మాజీ శమనేర్ చకేటి లక్ష్మణ్ చేతుల మీదుగా భీం దీక్ష స్వీకరించడం జరిగింది. ఈ దీక్షను స్వీకరించిన వారు S.శేఖర్ B. గోపి K.మహేందర్ , ఇతరులు పాల్గొనడం జరిగింది.