చేవెళ్ల ప్రమాద బాధితులను పరామర్శించిన భీమ్ భరత్

- మృతుల కుటుంబాలకు సానుభూతి
- గాయపడిన వారికి ధైర్యం తెలిపిన కాంగ్రెస్ నాయకుడు
జ్ఞానతెలంగాణ,చేవెళ్ల ప్రతినిధి :
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో సోమవారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పామేన భీమ్ భరత్ పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రిలో పరామర్శించారు. బాధితులను ఆప్యాయంగా ఆదరిస్తూ, వారికి ధైర్యం చెబుతూ మాట్లాడారు. ఆ రోజు అందుబాటులో లేక తాను వెంటనే రావలేకపోయానని, అయితే ఈ రోజు వచ్చి బాధితులను కలసి వారి పరిస్థితిని తెలుసుకున్నానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ, క్షతగ్రస్తులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పరామర్శ సందర్భంగా భీమ్ భరత్ ప్రమాద బాధితులకు పండ్లు పంచి, ఆయా కుటుంబాలకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరారు. బస్సు ప్రమాదంపై విచారణకు తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీచేసిందని, మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, మొయినాబాద్ మండల అధ్యక్షుడు మానయ్య, చేవెళ్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకుడు సుశాంత్, మొయినాబాద్ వైస్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి, కేబుల్ రాజు, కరణ్, గణేష్, బిక్షపతి, నిరంజన్ గౌడ్, చిలుకూరు రాజు తదితరులు పాల్గొన్నారు.









