పేదోడి గృహ కలకు తాళం తీసిన భీమ్ భరత్

  • చందిప్పలో నూతన ఇందిరమ్మ ఇల్లు ప్రారంభం
  • పేదరి సొంతింటి కల నెరవేర్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే – భీమ్ భరత్

చేవెళ్ల నియోజకవర్గంలో పేదల గృహ కలలకు ఆచరణ రూపం దాల్చే పనిని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పామేన భీమ్ భరత్ పేర్కొన్నారు. శంకర్ పల్లి మండలం చందిప్ప గ్రామానికి చెందిన మొగులయ్య, లక్ష్మీ దంపతులకు ప్రభుత్వం తరఫున మంజూరైన ఇందిరమ్మ ఇళ్లలో నిర్మాణం పూర్తి కావడంతో, వారి నూతన గృహాన్ని భీమ్ భరత్ ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దంపతులకు కొత్త వస్త్రాలు అందజేసి కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు.

సొంతిల్లు అనేది ఒక కుటుంబానికి భరోసా, భద్రత, ఆనందం అని భరత్ భావించారు. “మనకంటూ ఒక ఓలె, ఒక గూడు ఉంటే… ఆ నీడన కారం, రొట్టె తిన్నా తృప్తిగా అనిపిస్తుంది. సొంతిల్లు పేద మనిషికి జీవిత ఉత్సాహం ఇస్తుంది,” అని ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమం, గృహ హక్కు, సామాజిక భద్రత ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాధాన్యమని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరి సతీష్, జాతీయ నాయకులు షేర్ అనంత రెడ్డి, శంకర్ పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ రవీందర్ రెడ్డి, శంకర్, బద్దం కృష్ణారెడ్డి, శ్రీనాథ్, సమీ, శివ, ప్రశాంత్ రెడ్డి, సేవాదళ్ మండల నాయకులు ఈశ్వర్, శంకర్, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కార్యక్రమం గ్రామంలో ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించింది.

You may also like...

Translate »