పార్లమెంటు ఎన్నికల లో పోటీ చేయనున్న బర్రెలక్క.

పార్లమెంటు ఎన్నికల లో పోటీ చేయనున్న బర్రెలక్క.

జనవరి 24: తెలంగాణలో నిర్వహించిన శాసన సభ ఎన్నికల్లో బర్రెలక్క కొల్లాపూర్ నుంచి పోటీ చేసింది.బర్రెలక్క కు చాలా మంది మద్దతుగా నిలిచారు.ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారం కూడా ఆమె విస్తృతంగా చేసింది కొల్లాపూర్ స్ధానం నుంచి పోటీ చేసిన బర్రెలక్క ఓడిపోయింది ఆమెకు దాదాపు 6000వేల ఓట్లు పడ్డాయి. కానీ ఆమె క్రేజ్ మాత్రం విపరీతంగా పెరిగిపోయింది.ఎన్నికల వేళ బర్రెలక్క పేరు మారు మ్రోగింది సోషల్ మీడియాలో లక్షల్లో ఫాలోవర్స్ పెరిగారు చాలా మంది పెద్ద వ్యక్తులు ఆమెకు అండగా నిలిచారు ఆమె ధైర్యాన్ని మెచ్చు కున్నారు ఆర్థికంగానూ కొందరు సాయం చేశారు.అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బర్రెలక్క ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోసం రెడీ అవుతుందని తెలుస్తోంది. ఎలాగైనా రాజకీయాల్లో ఉండాలని ఫిక్స్ అయిన బర్రెలక్క ఇప్పుడు ఎంపీగా పోటీ చేయడానికి రెడీ అవుతుంది.ఈసారి నాగర్ కర్నూలు నుండి పోటీకి దిగుతానని బర్రెలక్క తెలిపింది అసెంబ్లీ ఎన్నికలు నేర్పిన పాఠాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి ఆచి తూచి అడుగులేస్తానని తెలిపింది బర్రెలక్క. మరి బర్రెలక్క పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి మరి.

You may also like...

Translate »