ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన

ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన
ఓవర్ స్పీడ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, హెల్మెట్ దారణ తదితర వాటి పై
శ్రీ చైతన్య స్కూల్ పిల్లలచే గుడి ముందు అవగాహన కార్యక్రమం
పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ కుమార్
వేములవాడ వార్త. ఫిబ్రవరి,8రోడ్డు భద్రత మహోత్సవాల్లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ ఆదేశాల మేరకు గురువారం వేములవాడ పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య స్కూల్ సహకారంతో పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి గుడి ముందు ట్రాఫిక్ రూల్స్ పై, ఫ్లాగ్ మోబ్, అవేర్నెస్ ప్రోగ్రాం విద్యార్థుల నృత్యాలు, ప్రదర్శనలతో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ ట్రాఫిక్ ఆర్ ఎస్సై దిలీప్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనం నడపరాదని, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ చేయరాదని, రోడ్డు నిబంధనలు పాటించి, ప్రాణాలను రక్షించుకోవాలని, మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్ సుదేశ్ కుమారి, సిబ్బంది సుధీర్, సుధాకర్, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులతో పాటు ట్రాఫిక్ పోలీసులు పాల్గొన్నారు.