పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ

పొద్దటూర్ లో ఆశిగళ్ల నాగేష్ బాబు సంతాప సభ,

ఆయన మరణించినా…, మాలో జీవించే…, ఉంటాడు.

భావోద్వేగానికి లోనైన, ఎం వి ఎఫ్ స్నేహితులు, కుటుంబ సభ్యులు.

జ్ఞాన తెలంగాణ ( శంకర్ పల్లి ) ఫిబ్రవరి ఐదున , అనారోగ్యంతో మృతిచెందిన,పొద్దుటూరు గ్రామానికి చెందిన, సామాజిక కార్యకర్త ఆసిగల్ల నగేష్ బాబు సంతాప సభ, పొద్దటూరు గ్రామంలో గురువారం జరిగింది. ఈ యొక్క సంతాప సభకు, బంధు మిత్రులు తన తో పాటు, మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ లో, బాలల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసిన, నాటి మిత్రులు భారీ సంఖ్య లో హాజరై, ఆయన చిత్రపటానికి, పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా ఆయనతో పాటు గడిపిన, నాటి మధుర స్మృతులను, జ్ఞాపకం చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు, చిన్న వయసులోనే ఈ విధంగా మా మధ్య నుంచి తిరిగిరాని లోకాలకు వెళతాడని మేము ఊహించలేదని, ఆయన మాకు మంచి మిత్రుడని, అందరితో కలిసి మెలిసి, ప్రేమ ఆప్యాయతలతో పలకరించేవాడని, శంకర్ పల్లి అంబేద్కర్ యూత్ స్థాపించుటలో కీలకంగా వ్యవహరించాడని, ఆనాటి జ్ఞాపకాల పంచుకున్నారు. అప్పటి,యం వి ఫౌండేషన్ చీఫ్ కోఆర్డినేటర్ రాజు మాట్లాడుతూ…, మేము మొదటిసారిగా మేము పొద్దుటూరు గ్రామానికి వచ్చినప్పుడు, గ్రామానికి చెందిన, మిత్రుడు సత్తయ్య వాళ్ళ ఇంటిలో, సమావేశం ఏర్పాటు, చేసి బాల కార్మికుల కొరకు అన్వేషణ ప్రారంభించామని, కొన్ని రోజుల తర్వాత, నాగేష్ బాబు ను, సత్తయ్య ఇంట్రడ్యూస్ చేశాడని, జ్ఞాపకం చేసుకున్నాడు,

అక్కడి నుంచి నాగేష్ బాబు గ్రామంలో ఉన్నటువంటి బాల కార్మికులను, సమీకరించి జీతాలు ఉన్న పిల్లలను, మోటివేషన్ చేసి చాకచక్యంగా క్యాంపులకు తరలించేవాడని, బాల కార్మికుల విషయంలో, ఎలాంటి సమస్యలు తలెత్తిన , గ్రామ పెద్దలతో మాట్లాడి, ఒప్పించి, పరిస్థితిని సద్దుమణిగేలా చేసేవాడని, జ్ఞాపకం చేసుకున్నాడు, ఆ తర్వాత ఆయన, వెనుదిరిగి చూడకుండా, మండలాలు, జిల్లాలు రాష్ట్రాలు, తిరిగి అనేక చోట్ల, బాల కార్మికులను సమీకరించి, వారికి విద్యాబుద్ధులు నేర్పి, వివిధ పాఠశాలల్లో చేర్పించి, ఎందరో బాల కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపడానికి, కీలకపాత్రను పోషించాడని జ్ఞాపకం చేసుకున్నాడు. నాతో.., ఎక్కువగా టచ్ లో లేకున్నా, ఏవైనా ఈవెంట్ ల సమయాల్లో కలిసినప్పుడు, వయసు మీద పడుతుండడంతో ఆరోగ్యం ఎలా ఉందని ఒకరినొకరం పలకరించుకునే వారమని, ఆయనలో సమాజానికి ఏదో చేయాలని, తపన ఎల్లప్పుడూ ఉండేదని, కుల నిర్మూలన కోసం అహర్నిశలు కృషి చేశాడని, తెలియజేశాడు,ఆయన మరణించిన ఆయన ఇచ్చిన స్ఫూర్తి మాలో జీవించే ఉంటుందని, తెలియజేశాడు, ఆయన సోదరుడు ఆశిగళ్ల గండయ్య మాట్లాడుతూ.., మా అన్న గురించి నేనేం మాట్లాడాలో, మాటలు రావడం లేదని, మేము చిన్ననాటి నుంచి కలిసి పెరిగామని, కలిసి చదువుకున్నామని, మేమిద్దరం క్లాస్మేట్స్ మని, ఇద్దరం కలిసి యం వి ఫౌండేషన్ లో పనిచేశామని, చిన్ననాటి జ్ఞాపకాలు తలచుకుంటే, నాకు కన్నీరు ఆగడం లేదని, కన్నీటి పర్యంతమయ్యాడు, చివరిసారిగా హాస్పిటల్ కి వెళ్తున్నప్పుడు, నాకు ఫోన్ చేసి, హెల్త్ బాలేదు హాస్పిటల్ కి వెళుతున్నానని చెప్పాడని, నేను వెంటనే హాస్పిటల్ వెళితే నా చేయి పట్టుకొని కన్నీరు పెట్టుకున్నాడని, చిన్న వయసులోనే, ఈ విధంగా మాకు దూరమైపోతాడని, ఊహించుకోలేదని తీవ్ర బావోద్వేగానికి గురయ్యాడు .మా కుటుంబం కోసం వచ్చి, మమ్మల్ని ఓదార్చిన, యం వి ఎఫ్ కుటుంబ సభ్యులందరికీ రుణపడి ఉంటామని తెలియజేశాడు. ఈ కార్యక్రమంలో, శంకర్, నాగార్జున, కుల నిర్మూలన సంఘం తరఫున వాహిద్, జోష్ణ, అలివేలుమంగ, బిక్షపతి, బిబిష, తొండ యాదయ్య, శ్రీశైలం, బహుజన సమాజ్ పార్టీ చేవెళ్ల ఇంచార్జ్ జామా చంద్రం, పర్వేద బిక్షపతి, బి మల్లేశ, రాములు,బాలకృష్ణ,పొద్దుటూరు గ్రామ మాజీ డిప్యూటీ సర్పంచ్ బండ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »