ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నట్లు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా కోసం నా వంతు కృషి చేస్తానని ఆయన చెప్పారు.

దిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి.. ఉమ్మడి ఏపీ భవన్‌కు వెళ్లారు.

ఈ సందర్భంగా మాట్లాడారు. ‘‘ఏపీని ఆదుకోవాలని ప్రధాని హోదాలో మన్మోహన్ సింగ్‌ పార్లమెంట్‌లో హామీ ఇచ్చారు. విభజన వేళ ఇచ్చిన హామీ అమలు చేయకపోవడం బాధాకరం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి’’ అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.

You may also like...

Translate »