ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్.

ప్రజల వద్దకే పరిపాలన ‘ప్రజా పాలన’ __ అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన గౌడ్.
చేవెళ్ల, జ్ఞానతెలంగాణ : డిసెంబర్ 29ప్రజల వద్దకే పరిపాలన అందించేందుకు వ్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిందని అంతారం గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన అంజన్ గౌడ్ అన్నారు. శుక్రవారం మండల వరిధిలోని అంతారం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిణి తులసి, ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ నాగేశ్వర్ రావు తో కలిసి పాల్గొని గ్రామ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ ఎన్. సులోచన అంచన్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీ పథకాలతో పాటు గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కూడా కొనసాగించాలని అన్నారు. ప్రజలకు చేరువగా పాలన అందిచడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెపట్టిన ప్రజాపాలన కార్యకమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అభయ హస్తం కింద అర్హులైన అబ్దిదారులు మహాలక్ష్మి, ఇందిరమ్మ ఇండ్లు, గృహాజ్యోతి, పథకాలకు సంబంధించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలనీ అన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6గ్యారంటి పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించాలని అన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీటీసీ కావలి సుజాత, ఉప సర్పంచ్ మన్నెగూడెం అనసూయ, మాజీ ఎంపీటీసీ మన్నెగూడెం ఎల్లన్న, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కావలి వెంకటేష్ బాబు, బేగరి అంజయ్య, ఆరాంజనేయులు, గ్రామస్తులు తదితరులున్నారు.