శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి

శంకర్ పల్లి మండల ఎంఈఓ పై చర్యలు తీసుకోవాలి
- టెన్త్ క్లాస్ పర్మిషన్ లేకుండానే అడ్మిషన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్న శ్రీ చైతన్య పాఠశాల.
- శ్రీ చైతన్య టెన్త్ క్లాస్ పర్మిషన్ ఉందా అని ఎంఈఓ కి ఫోన్ చేసి అడిగితే ఉందని సమాధానం ఇచ్చారు.
- డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ కమిషనర్ కి వినతి.
- పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ డిమాండ్
శంకర్ పల్లి ఎంఈఓ, జన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అక్బర్ పై విచారణ జరిపించాలని
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ నవీన్ నికోలాస్ కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పిడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఖానాపురం రాజేష్ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా, శంకర్ పల్లి మండల ఎంఈఓ, జన్వాడ గ్రామ లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెడ్మాస్టర్ అయినటువంటి ఎండీ. అక్బర్ పై విచారణ విచారణ జరిపించాలి. మండల ఎంఈఓ అక్బర్ 2015 ఆగస్టు నుండి శంకర్ పల్లి మండల ఎంఈఓ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు స్కూల్స్ కి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. 2009 విద్యాహక్కు చట్టానికి వ్యతిరేకంగా మండలంలో ఉన్న ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్లో బుక్స్ యూనిఫామ్స్ షూస్ అమ్ముతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. శంకర్ పల్లి మండల కేంద్రంలోని శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్ కి ప్రస్తుతానికి కూడా టెన్త్ క్లాస్ పర్మిషన్ లేదు. అయినా టెన్త్ క్లాస్ అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. దీనిపైన పిడిఎస్ యు నాయకులు ఎంఈఓ కి కాల్ చేస్తే పర్మిషన్ ఉంది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా జన్వాడ గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం వెచ్చించిన పియం శ్రీ నిధులు దాదాపు తొమ్మిది లక్షల రూపాయలను ఏమి చేశారు. వీటిపై విచారణ జరపాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం ( పిడిఎస్ యు ) రంగారెడ్డి జిల్లా కమిటీ గా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో చేవెళ్ల డివిజన్ కార్యదర్శి బొజ్జి శ్రీకాంత్ ఉన్నారు.
