డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్థంతిని

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69 వ వర్థంతిని


ఒమన్ రాజధాని మస్కట్లోని పూలే – అంబేద్కర్ ఆర్గనైజేషన్ గ్రూప్ మరియు రమాబాయి సేవా సమితి గ్రూప్ ల ఆధ్వర్యంలో అలాగే సావిత్రి బాయి పూలే గ్రూప్, భీంరావు సేవా సమితి గ్రూప్, AP యూత్ గ్రూప్ వారి సమక్షంలో డిసెంబర్ 6 వ తేదీ శుక్రవారం రోజు నాడు ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు, అంబేద్కరిస్టులు హాజరై బాబాసాహెబ్ ఫొటోకు పూలమాల వేసి, నివాళిని అర్పించడం జరిగింది…ఈ సందర్భంగా డాక్టర్ బి,ఆర్ అంబేద్కర్ గారు దళిత, బహుజనుల ఉన్నతి కోసం, స్త్రీలు మరియు కార్మికుల హక్కుల కోసం పడ్డ శ్రమను, రచించిన చట్టాలను, ప్రస్తావిస్తూ పలువురు వక్తలు చేసిన ప్రసంగాలు ఆకట్టుకున్నాయి…మస్కట్ లో గల అంబేద్కర్ సంఘాలన్నీ ఇలాగే కలిసికట్టుగా ముందుకొచ్చి ఏకతాటిపై నడుస్తూ, సమాజాన్ని చైతన్యపరిచే దిశగా అడుగులేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ, కార్యక్రమాన్ని ముగించడం జరిగింది.

-NGR

You may also like...

Translate »