శంషాబాద్ లో బాలుడు మిస్సింగ్

  • శంషాబాద్ లో బాలుడు మిస్సింగ్
  • కేసు నమోదు చేసిదర్యాప్తు చేపట్టిన పోలీసులు

జ్ఞాన తెలంగాణ,రాజేంద్రనగర్ ,డిసెంబర్ 28:

మండల పరిధి లో శనివారం బాలుడు తప్పిపోయిన ఘటన వెలుగులోకి వచ్చింది.వివరాల్లోకి వెళితే రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ శంషాబాద్ మండల పరిధి లోని మదనపల్లి కి చెందిన రామ్ చరణ్ తప్పిపోయిన విశయం పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు దారుడు అందించిన వివరాల ప్రకారం కేసు యొక్క వివరములు ఏమనగా అందులో ఫిర్యాదుదారుడి సోదరి అతని బావ చనిపోయారని, దాని కారణంగా తన మేనల్లుడు ఎం. రామ్ చరణ్ తండ్రి కీ. శే. వెంకటేష్, వయస్సు: 15 సంవత్సరాలు ఫిర్యాదుదారుడి తో పాటు మదనపల్లి లో నివాసముంటున్నాడు. తేదీ 26.12.2024 నాడు సుమారు 19:30 గంటల సమయంలో అతని ప్రక్క ఇంటి ఆమె కె. చెంద్రకళ ఫిర్యాదుదారుడి మేనల్లుడు రామ్ చరణ్ కు రూ. 100/- ఇచ్చి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నుండి ఫ్రైడ్ రైస్ తీసుకురమ్మని పంపినది , కాని అప్పటి నుండి అతని మేనల్లుడు రామ్ చరణ్ ఇంతవరకు తన ఇంటికి తిరిగి రాలేదు. తప్పిపోయిన బాలుడి వివరాలు: 5.5″, రంగు: నలుపు. బ్లూ కలర్ ప్యాంట్ బ్లూ కలర్ టీ-షర్ట్ ధరించి ఉన్నాడు. ఇప్పటివరకు ఫిర్యాదుదారు అతని మేనల్లుడు కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికాడు, కానీ అతని జాడ లేదు. దానితో ఈరోజు ఫిర్యాదుదారు పి ఎస్ కి వచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఇట్టి విషయం పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునాము అని పోలీసులు తెలిపారు.

You may also like...

Translate »