100 సంవత్సరాల CPI వార్షికోత్సవం

  • CPI జిల్లా నాయకులు పెద్ద బాబు

జ్ఞాన తెలంగాణ, అలంపూర్ డిసెంబర్ 27:

పటణ కేంద్రంలో భారత గడ్డపై ఎర్ర జెండా డిసెంబర్ 26న వందేలు పూర్తి చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూరులో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు జి పెద్దబాబు సిపిఐ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా జి.పెద్దబాబు మాట్లాడుతూ దేశంలో ఎర్రజెండా కొరకు ఎంతోమంది తన కుటుంబాన్ని కూడా త్యాగం చేసి అమరులైన సిపిఐ మాజీ జాతీయ కార్యదర్శి సూరవరం సుధాకర్ రెడ్డి గారికి, చత్తీస్గడ్లు అమరులైన మావోయిస్టు నేతలకి హిడ్మా కి విప్లవాది జోహార్లు చెప్తూ. దేశంలో బిజెపి కేంద్ర ప్రభుత్వం నడుస్తున్న విధానం ప్రజలకు సరైనది కాదు ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు వారి గురించి పట్టించుకోకుండా కార్పొరేటర్ సమస్యలపై దృష్టి పెట్టి ఆదాని అంబానికి లాభం చేకూర్చడానికి చత్తీస్గడ్ అడవుల్లో ప్రజల కలేజా సంపత్తులు దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అమిత్ షా కుట్ర పని ఈ దేశాధివాసి బిడ్డలు చత్తీస్గఢ్ అడవులకు రక్షణగా ఉన్న మావోయిస్టులను అక్కడికి వెళ్లి చంపేస్తే ఆ ఖనేజ సంపతులని దోచుకోవాలని పచ్చని అడవులను నాశనం చేసి అడ్డు వచ్చిన వారిని సంపుతూ రేపు తరానికి గాలి పీల్చడానికి లేకుండా పచ్చని అడవులను నాశనం చేసి. అడిగే వారు లేరని ఇట్లా ఎంతమందిని చంపుతారు ఈ దేశంలో ఉన్న రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వం పాటించకుండా కేవలం మావోయిస్టులు తుపాకి పట్టుకొని రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్నారని వారిపై పోలీస్ క్యాంపులు పెట్టి ఎన్నో వేల మందితో మావోయిస్టులను చంపుతున్నారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకమని సిపిఐ వామపక్షాలు మానవ హక్కుల కమిషన్ ప్రజలు అలా చంపడం కరెక్ట్ కాదని రాజ్యాంగం పద్ధతుల్లో కోర్టుకు హాజరు పరచాలని వామపక్షాలు మాట్లాడితే అర్బన్ నక్సలైట్ లు మీరు అని అంటున్నారు అయితే ఎర్రజెండా ను లేకుండా చేయాలని కేంద్ర ప్రభుత్వం అంటుంది.కబ్బర్ధర్ అంతం చేయాలని అంటే ప్రజలకు కుడు గుడు నిరుద్యోగులు లేకుండా దేశ ప్రజల ఆకలి అల్లాడుతున్నంతవరకు భూమి ఉన్నంతవరకు ఎర్రజెండా పోరాటం చేస్తూనే ఉంటుంది అని వారు అన్నారు ఈ కార్యక్రమంలో CPI నాయకులు ,కార్మికుల పాల్గొన్నారు.

You may also like...

Translate »