విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు

విటమిన్ ఏ తో కంటి చూపు మెరుగు
9నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ మందు వేయించాలి
-చేవెళ్ల ఆర్డీవో సాయిరాం
ఈనెల 13 నుంచి 18 వరకు మిటమిన్ ఏ చక్కల మందు పంపిణీ
– జిల్లా ఉపవైద్యాధికారి దామోదర్
చేవెళ్ల, జ్ఞాన తెలంగాణ: 9 నెలల నుంచి ఐదేళ్లలోపు చిన్నారులకు విటమిన్ ఏ చుక్కల మందు వేయించాలని చేవెళ్ల ఆర్డీవో సాయిరాం తెలిపారు. చేవెళ్ల మండలం కేంద్రంలోని అంగన్వాడి సెంటర్ లో మంగళవారం జిల్లా ఉపవైద్యాధికారి దామోదర్ తో కలిసి విటమిన్ ఏ చుక్కల మందును ప్రారంభించారు. సందర్భంగా ఆర్డీవో సాయిరాం మాట్లాడుతూ… విటమిన్ ఏ వేయించడం వల్ల పిల్లల కంటి చూపు మెరుగు పడుతుందని తెలిపారు. కంటిచూపు దెబ్బతినకుండా ఉండడానికి విటమిన్ ఏ చుక్కల మందు వేయించాలని సూచించారు.
పిల్లలకు తినిపించే ఆహారంలో విటమిన్ ఏ తక్కువగా ఉంటుందని తెలిపారు. అనంతరం జిల్లా ఉపవైద్యాధికారి దామోదర్ మాట్లాడుతూ..చిన్నారులకు విటమిన్ ఏ మందు వేయడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో అవసరమన్నారు.విటమిన్ ఏ లోపం కారణంగా రేచీకటి సమస్య వచ్చే ప్రమాదం ఉందని, విటమిన్ ఏ లోపం తీవ్రంగా ఉంటే..రెటీనా, కార్నియా దెబ్బతింటుందన్నారు. చిన్నారుల్లో విటమిన్ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదని, చిన్నారులు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఈనెల 13 నుంచి 18 వరకు మిటమిన్ ఏ చక్కల మందు పంపిణీ కార్యక్రమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ గోపాల్ రెడ్డి, సంతోష మయూరి, ఎంఎల్ హెచ్ పీ డాక్టర్ వేదశ్రీ, ఎన్ పీహెచ్ఏ స్వర్ణలలిత, అంగన్వాడీ టీచర్లు ప్రవీణ, ఉమారాణి, ఆశావర్కర్లు తదితరులు ఉన్నారు.