సెప్టెంబర్ 9న.. ఉపరాష్ట్రపతి ఎన్నిక

- ఏడో తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ
- 21న నామినేషన్ల ఉపసంహరణ
- 22న నామినేషన్ల పరిశీలన..
- 25న ఉపసంహరణకు గడువు
- సెప్టెంబర్ 9న పోలింగ్ .. అదే రోజు ఫలితాలు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న 782 మంది ఎంపీలు
జ్ఞానతెలంగాణ,స్టేట్ బ్యూరో :
భారత ఉప రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ శుక్రవారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీన ఉప రాష్ట్రపతి ఎన్నికకు నోటీ ఫికేషన్ వెలువరించనుంది. అదే రోజు నుంచి నామినేష న్లను స్వీకరిస్తారు. అభ్యర్థుల నామినేషన్ల సమర్పణకు ఆగస్టు 21వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు. 22వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన ఉంటుంది.. 25వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇక.. సప్టెంబర్ 9వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. ఫలితాలను కూడా అదేరోజు వెలువరిస్తారు.
ఉప రాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధనఖడ్ తన పదవీ కాలం ముగి యడానికి రెండు సంవత్సరాల కంటే ముందు జులై 21వ తేదీన రాజీనామా చేశారు. ఆయన పదవీకాలం 2027 ఆగస్టు 10న ముగియనుంది. అయితే.. ఆరోగ్య పరమైన కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు రాష్ట్రపతి ముర్ముకు పంపిన లేఖలో పేర్కొన్నారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారం భమైన రోజే ధ„డ్ ఈ నిరయం తీసుకోవడం గమనార్హం. 2022 ఆగస్టులో ధనఖడ్ ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. కాగా, నూతన ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహణ కుగాను రిటర్నింగ్ అధికారిగా రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీ నియమితులయ్యారు. న్యాయ మంత్రిత్వశాఖను సంప్ర దించడంతో పాటు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ సమ్మతి మేరకు ఈసీ నిర్ణయం తీసుకుంది. రాజ్యసభ సెక్రటేరియట్ జాయింట్ సెక్రటరీ గరిమా జైన్, సెక్రటేరియట్ డైరెక్టర్ విజయ్ కుమార్ సహాయ రిటర్నింగ్ అధికారులుగా సుగా వ్యవ హరిస్తారు. వారంతా ఉప రాష్ట్ర పతి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఉభయ సభలకు చెందిన 782 మంది ఎంపీలు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకో నున్నారు.. వాస్తవానికి లోక్సభలో మొత్తం 543 సీట్లు ఉండగా, వివిధ కారణాలతో ఒక సీట్లు ఖాళీగా ఉంది.. ఇక రాజ్యసభలో 12 నామినేటెడ్ సీట్లతో పాటు మొత్తం 245 మంది ఓట ర్లుండగా, అయిదు స్థానాలు ఖాళీ అయ్యాయి.. దీంతో రాజ్య సభ నుంచి 240 మంది సభ్యులు తమ ఓటును ఈ ఎన్నికల్లో వేయనున్నారు.