ఒమన్ లో ఫూలే,అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

ఒమన్ లో ఫూలే, అంబేద్కర్ జయంతి ఉత్సవాలు


ఒమాన్‌లోని ఫూలే, అంబేడ్కర్ ఆర్గనైజేషన్–ఓమాన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న
“ఫూలే, అంబేడ్కర్ మహానీయుల జయంతి ఉత్సవాలు–2026” కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఈ రోజు ఘనంగా విడుదల చేశారు. ఈ జయంతి ఉత్సవాలు 2026 ఏప్రిల్ 24వ తేదీ, శుక్రవారం నిర్వహించబడనున్నాయి.ఈ సందర్భంగా జన సవ్వడి కళావేదిక ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. బహుజనులందరూ ఈ కార్యక్రమానికి హాజరై, జయంతి ఉత్సవాలను ఘనంగా విజయవంతం చేయాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.

ఈ పోస్టర్‌ను పాస్టర్ జాన్ విక్టర్ గారు ఆవిష్కరించారు. పోస్టర్ విడుదల కార్యక్రమంలో
సంస్థ అధ్యక్షుడు వేణు ములంగిరి, నవీన్, లక్ష్మణ్, మహేష్, సంజీవ్, సుభాష్, నరేష్, దులూరి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.అలాగే మహిళా సంఘాల సభ్యులు కూడా పాల్గొన్నారు.బహుజన సమాజమంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘన విజయంగా నిలపాలని నిర్వాహకులు కోరారు.

You may also like...

Translate »