మరో నాలుగేళ్లు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ

మరో నాలుగేళ్లు ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీ
- పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్లు పొడిగింపు
- రక్తహీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యం
- 100 శాతం కేంద్ర నిధులతోనే అమలవుతున్న ఈ పధకం
- ఇప్పుడు 2028 డిసెంబర్ వరకు కొనసాగింపు
దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి పైగా పేదలకు రేషన్ ద్వారా ఉచిత ఫోర్టిఫైడ్ బియ్యాన్ని పంపిణీ చేసే పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజనను మరో నాలుగేళ్లపాటు పొడిగించే నిర్ణయానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గరీబ్ కళ్యాణ్ అన్న యోజన డిసెంబర్ 2028 వరకు అందుబాటులో ఉంటుంది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పధకంతో పాటు మరిన్ని సంక్షేమ పధకాలను పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 17,082 కోట్లతో ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఐసీడీఎస్, పీఎం పోషన్ సహా అన్ని పథకాల ద్వారా ఫోర్టిఫైడ్ రైస్ సరఫరా అవుతోంది. రక్తహీనత, శరీరంలో మైక్రో-న్యూట్రియంట్ల కొరతను అధిగమించడమే లక్ష్యం కేంద్ర ప్రభుత్వం ఈ పధకం కొనసాగిస్తోంది. పూర్తిగా 100 శాతం కేంద్ర నిధులతోనే అమలవుతున్న ఈ పధకం.. ఇప్పుడు 2028 డిసెంబర్ వరకు పేదలకు అందుబాటులోకి రానుంది.
