ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో రిజర్వేషన్లకు దిగ్విజయ్‌సింగ్ కమిటీ సిఫారసు

ప్రైవేటు విద్యా సంస్థల్లో రిజర్వేషన్లను తప్పనిసరి చేయడానికి పార్లమెంట్‌లో చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ్ సింగ్ సారథ్యంలో విద్యపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం స్పష్టం చేసింది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీలకు చెందిన విద్యార్థులకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ పరంగా అనుమతించదగినదిగా పేర్కొంది. ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27%, ఎస్సీలకు 15ు, ఎస్టీలకు 7.5ు రిజర్వేషన్లను కల్పించాలని కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు పార్లమెంట్‌కు కమిటీ తన నివేదికను సమర్పించింది.
