కేటీఆర్ కు జీవన్ రెడ్డి సవాల్

దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలి:ఎమ్మెల్సీజీవన్ రెడ్డి.

జగిత్యాల జిల్లా మార్చి 02: దమ్ము, ధైర్యం ఉంటే నిజామాబాద్ ఎంపీగా పోటీ చేయాలని కేటీఆర్ కు సవాల్ విసిరారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి.జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోదని సంచలన వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ కు రేవంత్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో 90 శాతం ప్రజలు లబ్ధిపొందే సంక్షేమ కార్య క్రమం 200 యూనిట్ ఉచిత విద్యుత్ అన్నారు. త్వరలో రేషన్ కార్డులు జారీ చేస్తామన్నారు.ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు ఇందిరమ్మ ఇండ్ల ఆర్థిక సహాయంపై విదివిధా నాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఏం మాట్లా డుతున్నారో అర్థం కావడం లేదన్నారు.హిందూ సంప్రదాయం గురించి మాట్లాడే నాయ కులు ఆడబిడ్డలను గౌరవిం చడం నేర్చుకోవాలని సూచించారు.

You may also like...

Translate »