ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన దాసరి

ఆర్ఎస్పీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరిన దాసరి
జ్ఞాన తెలంగాణ,సిర్పూర్ కాగజ్ నగర్: సిర్పూర్ కాగజ్ నగర్‌కు చెందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిమాని దాసరి నరేందర్ శనివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో ఆర్ఎస్పీ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా దాసరి నరేందర్ మాట్లాడుతూ..ఆర్ఎస్పీ అడుగు జాడల్లో నడుస్తూ బహుజన వాదాన్ని ముందుకు తీసుకెళుతామని అన్నారు.ప్రవీణ్ సార్‌తో పాటు పార్టీలో చేరి నాగర్ కర్నూల్ నుంచి ఎంపీగా గెలిపించుకుంటామని అన్నారు. బహుజన తెలంగాణ ఆర్ఎస్పీతోనే సాధ్యమని తెలిపారు.