కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.

కర్నూలు జిల్లాలో ఇద్దరు చిన్నారుల అదృశ్యం.
కర్నూలు ఫిబ్రవరి 02: కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన సురేంద్ర, లత దంపతులకు చెందిన పిల్లలు ఆదూరి ఉజ్వల, ఆదూరి అపూర్వ (7) అదృశ్యమయ్యారు.గురువారం రాత్రి 8:30 గంటల ప్రాంతంలో విద్యుత్ లేని సమయంలో చిన్నారులు ఈ సంఘటన చోటు చేసుకుంది. గ్రామం మొత్తం చుట్టుపక్కల వెతికినా ఆచూకి లభ్యం కాలేదు.గ్రామంలో సాయంత్రం 6 గంటల నుంచి ఇద్దరు గుర్తు తెలీని వ్యక్తులు టెంకాయ చెట్లకు ఇంజక్షన్లు వేస్తా మంటూ గ్రామంలో తిరుగుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.వీరి నివాసం పక్కిరప్ప స్వామి దేవాలయంలో గ్రామం చివరిలో ఉండడం వల్ల విద్యుత్ లేని సమయంలో కిడ్నాప్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.కుటుంబ సభ్యులు ఎస్ఐ మహ్మద్ రిజ్వాన్ కు ఫిర్యాదు చేయడంతో పోలీస్ డాగ్స్ తో రంగంలోకి దిగిన పోలీసులు కొనసాగు తున్న గాలింపు చర్యలు చేపట్టారు.