ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపు పట్ల హర్షం.

ఆంధ్రప్రదేశ్ లో కూటమి గెలుపు పట్ల హర్షం.
జ్ఞాన తెలంగాణ – బోధన్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో తెలుగుదేశం ఆధ్వర్యంలోని కూటమి అఖండ విజయం సాధించడం పట్ల తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ జిల్లా
శాఖ హర్షం వ్యక్తం చేసినట్లు తెలుగుదేశం పార్టీ నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,న్యాయవాది సి సీహెచ్. వి హన్మంతరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగుదేశం పార్టీ కూటమి శాసనసభ్యులు,పార్లమెంట్ సభ్యులు అధిక సంఖ్యలో గెలవటం కోసం కృషిచేసిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు,గెలిచిన శాసనసభ్యులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహించిన చంద్రబాబు నాయుడు సేవలను జాతీయ స్థాయిలో ఉపయోగించుకోవాలని ఎన్డీఏ కూటమికి ఆయన సూచించారు.నాల్గో పర్యాయం ముఖ్యమంత్రి పదవిని చెపట్టనున్న చంద్రబాబు నాయుడుకి నిజామాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తల తరపున అభినందనలు తెలిపారు.గత 5సంవత్సరాలుగా పతనావసస్థలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి పథంలో తీసుకొనిరావడంతో పాటు ప్రజల స్థితి గతులను మెరుగుపర్చడం,నిరుద్యోగ సమస్యలు తీర్చడంతో పాటు సంపదను సృష్టించడం, అభివృద్ధి చేయడం,కేవలం చంద్రబాబు నాయుడుకె సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
చంద్రబాబు నాయుడుతో పాటు,నారా లోకేష్,పార్టీ నాయకులు,కార్యకర్తలు, పొలిట్ బ్యూరో సభ్యుల కృషి,కూటమి మిత్ర పక్షాల సహకారం తో ఈ గెలుపు కి తోడ్పడ్డాయని ఆయన అన్నారు.తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం సమస్తాగతంగా బలపడడానికి ఇది సరైన సమయం అని,ఆ దిశలో ఆలోచించాలని అయన విజ్ఞప్తి చేశారు.తెలంగాణా తెలుగుదేశం పార్టీ సామాన్య కార్యకర్తల అభిమానం ఎల్లప్పుడూ పార్టీ పైన,అధినేత చంద్రబాబు పైన అధికంగా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.