జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…!

అమరావతి :జై భారత్ నేషనల్ పార్టీ ప్రారంభించిన మాజీ జేడీ లక్ష్మీనారాయణ…!
సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.
ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ.
సుపరిపాలన కోసమే జై భారత్ నేషనల్ పార్టీ.. రాజకీయాలు అంటే సుపరిపాలన అని నిరూపిస్తాం.. నిరుద్యోగం ప్రధాన సమస్యగా ఉంది.. వీళ్లు.. వారు తిన్నారు అంటున్నారు, వాళ్లు.. వీరు కూడా తిన్నారు అంటున్నారు…అవినీతిని అంతమొందించేందుకే వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ… బానిసత్వం నుంచి ప్రజలకు విముక్తి కలిగిస్తుంది అభివృద్ధితో అవసరాలు ఎలా తీర్చుకోవాలే నేర్పిస్తుంది.. ప్రత్యేక హోదా విషయంలో అన్ని పార్టీలు విఫలమయ్యాయి.. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడానికి పుట్టిందే జై భారత్ నేషనల్ పార్టీ.. కుంటుంబపాలన చుట్టే రాజకీయాలు తిరుగుతున్నాయి.. మేం తప్పు చేయం.. అప్పు చేయం.. చీకటిలో ఉన్న రాష్ట్రంలో వెలుగులు నింపడానికి వచ్చిందే జైభారత్ నేషనల్ పార్టీ : మాజీ జేడీ లక్ష్మీనారాయణ