వల్లభనేని వంశీ. ఆరు నెలలుగా డైలీ ఎపిసోడ్‌గా, రేపోమాపో అరెస్ట్ అన్నట్లు గా కొనసాగిన వ్యవహారం కాస్త.. క్లైమాక్స్ వచ్చింది. ఫైనల్‌గా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీని కీలక సెక్షన్లు పెట్టి బుక్ చేసి జైలుకు కూడా పంపిం చారు. టీడీపీ ఆఫీస్ మీద దాడి కేసులో బెయిల్ మీదున్న వంశీని..అదే కేసులో చిన్న ట్విస్ట్ ఇచ్చి మూసేశారు.టైమ్ చూసి మరీ ఎప్పటి నుంచో హాట్ టాపిక్‌గా ఉన్న వంశీ ఎపిసోడ్‌ను తెరమీదకు తెచ్చారు. ఇక వాట్ నెక్స్ట్ అన్నదే ఇంట్రెస్టింగ్‌గా మారింది. వంశీ అరెస్ట్‌తో మిగతా వాళ్లలో గుబులు మొద లైందా? కూటమి సర్కార్ అసలు గేమ్ స్టార్ట్ చేసిందా?ఏపీ పాలిటిక్స్ ఒక్కసారిగా హైవోల్టేజ్ హీట్‌కు చేరుకున్నాయి. అధికార కూటమి దూకుడుతో మరోసారి పొలిటికల్ వెదర్ కాక పుట్టిస్తోంది. ఎలాంటి హడావుడి, హంగామా.. లీకులు లేకుండా..తెల్లారే సరికే ఓ కీలక నేత అరెస్ట్ వార్త సంచలనం రేపింది. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పొద్దు పొద్దున్నే పోలీస్ కారు ఎక్కించేశారు.
గత సర్కార్ హయాంలో ఓవరాక్షన్ చేశారని..ఆడ, మగ తేడా లేకుండా అడ్డగోలుగా మాట్లాడారని.. ఆరోపణలు ఉన్న వాళ్లంతా కూటమి సర్కార్ అధికా రంలోకి రాగానే సైలెంట్ అయిపోయారు.కట్ చేస్తే సడెన్‌గా ఫోకస్ వంశీ వైపు టర్న్ చేశారు.. కేసులు నమోదు అవుతుం డటంతో ముందస్తు బెయిల్ కూడా తెచ్చుకున్నారు. అయితే రెండు మూడు నెలలుగా పెద్దగా అరెస్టులు, సర్కార్ యాక్షనేం లేకుండా పోయింది.దీంతో తమ మీదున్న కేసుల్లో ఇప్పట్లో అరెస్ట్ అయ్యే అవకాశం లేదను కున్న వాళ్లంతా మెల్లిగా రోడ్డెక్కడం స్టార్ట్ చేశారు. కాస్త హడావుడి కూడా చేయడం మొదలెట్టారు.నిజానికి గత ఆరు నెలలుగా వల్లభనేని వంశీ అరెస్ట్‌పై ఎన్నో ఊహాగా నాలు వినిపించాయి. ఏ క్షణంలోనైనా వంశీని కమ్మేయడం ఖాయమన్న టాక్ వినిపించింది. కానీ టైమ్ చూసి..ఏ పొలిటికల్ హడావుడి లేని టైమ్‌లో కూటమి సర్కార్ సడెన్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చిందన్న చర్చ నడుస్తోంది.