సీఎం చంద్రబాబు నాయుడు,అధ్యక్షతన వెలగపూడిలోని సచివాల యంలో ఏపీ కెబినెట్ భేటీ గురువారం ఉదయం 11 గంటలకు జరగనుంది, ఈ భేటీకి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, సీఎస్ సహా ప్రభుత్వ సలహాదారులు హాజరుకానున్నారు.42 అంశాల ఎజెండాతో ఏపీ కేబినెట్ సాగనుంది. ఈ భేటీలో ప్రధానంగా అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. బిల్డింగ్ పీనలైజెషన్ లేఔట్ రెగ్యులరైజేషన్‌లకు ఆమోదం వల్ల నిర్మణాలు, లేఔట్లు క్రమబద్ధరించుకునే అవకాశం ఉంది.సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి కూడా కేబినెట్‌లో చర్చించే అవకాశం ఉంది. ఏపీకి పెట్టుబడులు, కొత్త పరిశ్రమలు లక్ష్యంగా బాబు సింగపూర్ పర్యటనపై చర్చ సాగనుంది. రాజధాని అమరాతికి నిర్మాణానికి భూసేకరణపై కూడా చర్చ చేయనున్నట్లుగా తెలుస్తోంది.ఎస్ఐపీబీ ప్రతిపాదనలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీఆర్డీఏ ప్రతిపాదనలకు సంబంధించి చర్చ, ఆమోదించనుంది. నాలా చట్ట సవరణకు సంబంధించి కేబినెట్ చర్చించనుంది. పలు సంస్థలకు భూ కేటాయిం పుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నారు. నాలుగు కొత్త పాలసీలకు సంబంధించి కేబినెట్‌లో చర్చ జరిగే అవకాశాలు ఉన్నాయి.ప్రభుత్వంలో సైన్స్ అండ్ టెక్నాలాజీ కొత్త శాఖ ఏర్పాటు సంబంధించి చర్చించే అవకాశం ఉంది. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌కు సంబంధించి టేబుల్ ముఖ్యంగా చర్చించే అవకాశాలు ఉన్నాయి.