పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం..!

జ్ఞాన తెలంగాణ సిద్ధిపేట జిల్లా ప్రతినిథి మార్చి 03.

సిద్ధిపేట మండలం పుల్లూరు గ్రామంలో 2003-2004 ఎస్ఎస్సి బ్యాచ్ విద్యార్థులు 20వ వసంతోత్సవం సందర్భంగా వారు చదువుకున్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుల్లూరులో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.ఈ సందర్భంగా అప్పటి విద్యార్థులు ఎక్కడెక్కడో స్థిరపడ్డా ఈనెల 3న ఆదివారం రోజున అందరూ కలిసి ఆత్మీయంగా పలకరించుకుని వారి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ఎంతైనా బాల్యం మరుపురాని రోజులని అప్పటి మా గురుదేవులు మమ్మల్ని క్రమశిక్షణలో భాగంగా కఠినమైన శిక్షలు విధించి మమ్మల్ని ఒ స్థాయికి తీసు కొచ్చినందుకు వారికి మేము ఏమిచ్చి రుణం తీర్చుకున్న సరిపోద్దని ఈ పాఠశాలలో చదువుకున్న మేమంతా ఎంతో ప్రయోజకులై వివిధ రంగాలలో స్థిరపడ్డ ఆనాటి తీపి జ్ఞాపకాలు ఈనాడు మళ్లీ మేము కలుసుకొని గుర్తు చేసుకోవడం నిజంగా చాలా ఆనందాన్ని కలిగించిందని తెలియజేశారు. బాల్యం ఎప్పటికీ తిరిగి రాదని ఆ బాల్య జ్ఞాపకాలు కనీసం ఈ విధంగానైనా నెరవేర్చుకునే అవకాశం కలుగుతుందని అన్నారు మాకు విద్యాబుద్ధులు అందించిన మా గురుదేవుల్లకు జీవితాంతం రుణపడి ఉంటామని వారి ప్రేమ అనురాగం వారి ఆశీస్సులు మా అందరిని ఈ రోజు ఈ స్థాయిలో ఉంచిన గురుదేవులు అందరికీ హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఒక మంచి పుస్తకం 100 మంది స్నేహితులకు సమానమని కానీ ఒక మంచి మిత్రుడు ఒక గ్రంథాలయంతో సమానమని అన్నారు. తదనంతరం పూర్వ విద్యార్థులందరూ కలిసి తమ ఉపాధ్యాయులకు శాలువా కప్పి సన్మానం చేశారు.ఈ కార్యక్రమంలో 2003- 2004 బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

You may also like...

Translate »