కంగ్టి మండల కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి

కంగ్టి మండల కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి

  • ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఏర్రొల మహేష్


జ్ఞాన తెలంగాణ నారాయణఖేడ్ ఏప్రిల్ 9

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ రోజు కంగ్టి మండల కేంద్రంలోని లిటిల్ స్టార్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి కంగ్టి మండల రెవెన్యూ అధికారి విష్ణు సాగర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రొల మహేష్ మాట్లాడుతూ ఈరోజు పిల్లల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేదు అని పిల్లలకు ఎండలో గంట రెండు గంటల పాటు నిలబెట్టడం జరిగింది.దానితో పిల్లల తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ నాయకులను సంప్రదించారు తక్షణమే ఎస్ఎఫ్ఐ నాయకులు స్పందించి లిటిల్ స్టార్ పాఠశాలకు చేరుకున్నారు పాఠశాల యాజమాన్యం వేలకు వేలు ఫిజ్జులు వసూలు చేస్తూ కూడా బస్సులో పరిమితినీ మించి ఎక్కువ మందిని ఇరికించి మరి తీసుకెళ్తున్నారు అని ఆ బస్సును ఆపి స్థానిక మండల అధికారి అయిన శంకర్ సార్ కి కాల్ చేసి వివరించడం జరిగింది అయిన ఆయన పట్టించుకోని పరిస్థితి ఉంది లిటిల్ స్టార్ పాఠశాలలో కనీసం అర్హత కలిగిన టీచర్స్ కూడా లేకుండా నడిపిస్తున్నారు అని మండిపడ్డారు పాఠశాలలో కనీస మౌళిక సదుపాయాలు కూడా లేని పరిస్థితి ఉంది.పాఠశాలకు పిల్లలకు ఆడుకోవడానికి కూడా ఆట స్థలం లేదు అదేవిధంగా కమర్షియల్ బిల్డింగ్ లో నడుపుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇప్పటికైన అధికారులు స్పందించి లిటిల్ స్టార్ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలి అని అన్నారు లేని యెడల భవిష్యత్తులో ఉద్యమాలు ఉదృతం చేస్తామని అధికారులకు హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్,అబ్రహం,అనిల్ పిల్లల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

You may also like...

Translate »