భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన పది గొప్ప గుణాలు

భగవాన్ బుద్ధుడు ప్రబోధించిన పది గొప్ప గుణాలు
భగవాన్ బుద్ధుడు నైతిక నియమాలను అనుసరించమని పంచశీలాలు, అష్టాంగ మార్గాలు, నిర్వాణాన్ని ప్రబోధించారు. వీటితో పాటుగా భగవాన్ బుద్ధుడు పది గొప్ప గుణాలను కూడా పెంపొందించుకోవాలి అని చెప్పారు. వీటినే డా.బాబాసాహెబ్ అంబేడ్కర్ తప జీవితంలో ఆచరించారు.అందుకే బాబాసాహెబ్ డా.అంబేడ్కర్ ప్రపంచ దేశాలలో బోధిసత్త్వుడిగా కోనియాడబడుతున్నారు.బాబాసాహెబ్ డా. అంబేడ్కర్ అనుయాయులందరూ కూడా ఈ పది గుణాలను అలవరచుకోవాలి.
పది గుణాలు :
౼౼౼౼౼౼౼౼౼
1.ప్రజ్ఞ : విజ్ఞత , అజ్ఞానాంధకారాన్ని, అవిద్యను రూపుమాపే కాంతి.ప్రజ్ఞ అనగా నవ విజ్ఞానం.
2.శీలం : నైతిక బుద్ధి, మంచి బుద్ధిని కలిగి ఉండటం.
3.నిగమ : ఈ లోకంలో బయటకు కనిపించే అవసరాలను త్యాగం చేయడం.
4.దానం : మన దగ్గర ఉన్నవి లేనివారికి దానం చేయడం. ఇతరుల నుండి ఏమీ ఆశించకుండా నిస్వార్థంగా దానం చేయడం.దానం అవసరం ఉన్న వ్యక్తులకు అది కూడా నిరుపేదలకు, అనాథలకు చేయాలి అని బుద్ధుడు ఉపదేశించారు.అన్నీ ఉన్న వారికి తమను తాము పోషించుకోగలవారికి చేసే దానం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.
5.వీర : సరియైన పనులు. మన శక్తి మేరకు పనిచేయడం.లక్ష్య సాధనలో వెనక్కి తిరగకుండా పనిచేయడం.
6.కాంతి : సహనం కలిగి ఉండటం. ద్వేషం లేకుండా జీవించడం.
7.సత్య : నిజం మాట్లాడటం.ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం.అసత్యం పలుకరాదు.
8.అధిష్టానం : పదిమందికి మేలు చేయడం కోసం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి గానూ స్థిర నిశ్చయం కలిగి ఉండటం.
9.మైత్రి : ప్రతి ప్రాణి యెడల మిత్ర భావం కలిగి ఉండటం. ఆపదలో ఉన్న ప్రతి జీవికి సహాయం చేయడం.
10.ఉపేక్ష : నిర్లిప్తత.ఫలితాలకు చలించకుండా అన్వేషణ కొనసాగించడం.అందరి పట్లా సమన్యాయం కలిగి ఉండటం ఉపేక్ష.
ఈ పది సుగుణాలను మనం సాధ్యమైనంత మేరకు పాటించాలి అని భగవాన్ బుద్ధుడు చెప్పారు అని డా.అంబేడ్కర్ మనకు వివరించారు. వీటిని పాలీ భాషలో దశ పారమితలు అని అంటారు.
— అరియ నాగసేన బోధి
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది