మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి.
సంఘ సేవకురాలు, భారతదేశ తొలి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి భాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని సామాజిక కార్యకర్త ఉపాధ్యాయుడు మర్పల్లి అశోక్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రి భాయి పూలే జన్మదినమైన జనవరి మూడును మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటిస్తూ ఈరోజు ప్రభుత్వ ఉత్తర్వులను జారీ చేయడం సావిత్రిబాయికి అర్పించే నిజమైన నివాళులని ఈ సందర్భంగా గుర్తు చేయడం జరిగింది. సమాజంలోని అన్ని వర్గాల బాలిక,మరియు మహిళల విద్య కొరకు సావిత్రిబాయి అహర్నిశలు కృషి చేయడం జరిగిందన్నారు.వారి త్యాగ ఫలితంగానే నేడు మహిళలు అన్ని రంగాలలో రాణించగలిగి సమసమాజ అభివృద్ధిలో భాగమైనరని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలపడం జరిగింది.