మార్గశిర పౌర్ణమి శుభాకాంక్షలు

మార్గశిర పౌర్ణమి శుభాకాంక్షలు


బౌద్ధ ధమ్మంలో పౌర్ణమి యొక్క ప్రాముఖ్యత: బౌద్ధ ధమ్మంలో పౌర్ణమికి ప్రాముఖ్యత ఉంది. భగవాన్ బుద్ధుని జీవితంలో అన్ని ముఖ్యమైన సంఘటనలు ఈ పౌర్ణమి రోజున జరిగాయి.భగవాన్ బుద్ధుని జననం, జ్ఞానోదయం, ధర్మచక్రం ప్రారంభించడం మరియు మహాపరినిర్వాణం వంటి అన్ని సంఘటనలు ఒకే పౌర్ణమి రోజున జరిగాయి. బౌద్ధులు జరుపుకునే పండుగ రోజులు‌,ఉత్సవాలలో పౌర్ణమి ఒకటి.గడిచిన కాలంలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను తలచుకుని చేసుకునేవే ఈ పండుగలు, ఉత్సవాలు.ప్రపంచ వ్యాప్తంగా బౌద్ధులు ఈ పండుగలు ,ఉత్సవాలు జరుపుకుంటున్నారు.ఈ సమయాలలో ధమ్మ ప్రవచనాలను విని స్ఫూర్తి పొందుతారు. చిన్న నాటి నుండి పిల్లలను కూడా బౌద్ధ ధమ్మంలోకి తీసుకుని వచ్చి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకుంటారు.సంవత్సరానికి 12పౌర్ణమిలు.ఈ 12 పౌర్ణమిలు బౌద్ధులకు పవిత్రమైనవి.ప్రతి పౌర్ణమి రోజున ఏదో ఒక ముఖ్యమైన సంఘటన యాదృచ్చికంగా చోటుచేసుకుంది.ఈ ప్రతి నెలా వచ్చే పౌర్ణమి రోజున బౌద్ధులు ఉపోసథను ,అష్టశీలను పాటిస్తారు. బౌద్ధులు రోజూ ధమ్మ నియమాలను పాటించాలి.అయితే ఈ ప్రత్యేక రోజులలో తప్పనిసరిగా పాటించాలని బౌద్ధులు చెబుతారు.

మార్గశిర పౌర్ణమి విశిష్టత

ఈ మార్గశిర పౌర్ణమి డిసెంబర్ నెలలో వస్తుంది.సామ్రాట్ అశోకుని తనయ సంఘమిత్ర. ఈమెకు ఒక తనయుడు సమన్.సంఘమిత్ర తన 19 సంవత్సరాల ప్రాయంలో తన తండ్రితో పాటుగా తానూ బౌద్ధ భిక్ఖుణిగా మారి , ధమ్మ ప్రచారం కోసం,బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేయడం కోసం సింహళ (శ్రీలంక) దేశానికి వెళ్ళింది.సంఘమిత్ర మార్గశిర పౌర్ణమి రోజునే సింహళ దేశంలో తొలి బౌద్ధ భిక్ఖుణి సంఘాన్ని ఏర్పాటు చేసింది.సింహళ (శ్రీలంక) దేశానికి తన వెంట తీసుకుని వెళ్ళిన బోధి వృక్షం మొలకను అనురాధ పురంలో నాటడం జరిగింది.నేటికీ ఈ బోధి వృక్షం అనురాధపురంలో ఉంది. పర్యాటకులను ఆకర్షిస్తున్న బోధి వృక్షం ఇది.సంఘమిత్ర తన వెంట తీసుకుని వెళ్ళిన బోధి వృక్షపు మొలక ఆనాడు బుద్ధునికి జ్ఞానోదయం అయిన చోట ఉన్న బోధి వృక్షానిది.సంఘమిత్ర తనయుడు సుమన్ కూడా కొన్నాళ్ళ తరువాత బౌద్ధ భిక్ఖువుగా మారాడు.

నలగిరి ఏనుగుపై విజయం :

బుద్ధ భగవానుడి సోదరుడు భిక్షువు దేవదత్తుడు మహారాజు బింబిసారుని కుమారుడు అజాతశత్రు రాజుతో చేతులు కలిపి, తథాగత బుద్ధుడిని చంపడానికి ప్రణాళికలు ప్రారంభించాడు. అందులో భాగంగా దేవదత్తుడు అజాతశత్రు రాజు ఏనుగు గుట్టలో ఉన్న నలగిరి అనే ఏనుగును తాగించి బుద్ధుని వద్దకు మహుతుడిని వదలమని కోరాడు. నలగిరి ఏనుగు వాయు వేగంతో బుద్ధుని వైపు వచ్చింది. కానీ బుద్ధుని దగ్గరకు రాగానే ఏనుగు యొక్క వేగం తగ్గడంతో శాంతించి బుద్ధుని ముందు మోకరిల్లింది. నలగిరి ఏనుగు బుద్ధుడికి నమస్కరించింది. బుద్ధునిలో ఉన్న అపారమైన మైత్రీ భావన కరుణ వల్ల నలగిరి ఏనుగు ఏమీ.చేయలేకపోయింది. మార్గశీర్ష పూర్ణిమ రోజున ఇది జరిగింది

బింబిసార రాజు విరాళం :

గౌతమ బుద్ధుడు మార్గశిర పూర్ణిమ రోజున రాజగృహానికి వెళ్ళాడు. అక్కడ రాజు బింబిసారుడు వనాన్ని బుద్ధ సన్యాసులకు దానం చేశాడు. బుద్ధ భగవానుడు రాజభవనానికి వచ్చారనే వార్త విని, రాజు మరియు నగర ప్రజలు అతనిని చూడటానికి అక్కడికి వెళ్లారు. ఈ రోజున, రాజు బింబిసారుడు బుద్ధుడిని సన్యాసుల బృందంతో భిక్షకు ఆహ్వానించాడు. బుద్ధుడు భోజన ఆహ్వానాన్ని అంగీకరించాడు. భోజనానంతరం బుద్ధుడు ధమ్మ ప్రవచనం చేశారు.అప్పుడు రాజు వర్వు వనాన్ని బుద్ధుల సంఘానికి దానం చేశాడు.

శ్రీలంకలో బోధి వృక్షాన్ని నాటడం

మార్గశిర పూర్ణిమ రోజున, భిక్షుణి సంఘమిత్ర శ్రీలంక యొక్క పాత రాజధాని నగరమైన అనురాధపురలోని బుద్ధ గయ నుండి బోధి చెట్టు కొమ్మను నాటారు. ఈ అతి ముఖ్యమైన సంఘటన మార్గశిర పూర్ణిమ నాడు జరిగింది.

ఉపోసత వ్రతం :

బౌద్ధులు మార్గశిర పూర్ణిమ రోజున ఉపోసత వ్రతాన్ని పాటిస్తారు. ఈ రోజున, ఒకరు తన ఎంపిక ప్రకారం పంచశీల, అష్టశీల లేదా దశశీలను పాటిస్తారు. ఈ రోజున బౌద్ధ ఆరామాలకు వెళ్లి త్రిశరణ మరియు పంచశీలను తీసుకొని తథాగత బుద్ధుని ధమ్మం గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయాలి

అర్హంతురాలు సంఘమిత్తా

మగధ సామ్రాజ్యాన్ని పాలించిన సామ్రాట్ అశోకుని తనయ సంఘమిత్తా (సంఘమిత్ర).సంఘమిత్త గొప్ప బౌద్ధ మునీశ్వరి.మహిందకు సోదరి సంఘమిత్తా.సంఘమిత్ర భారతదేశానికి చెందిన అశోక చక్రవర్తి (304 – 232 BCE) కుమార్తె. 281 BC సమయంలో, ఆమె భారతదేశంలోని మధ్యప్రదేశ్‌లోని ప్రస్తుత ఉజ్జయినిలో జన్మించింది.ఆమె అశోకుని రెండవ సంతానం మరియు శ్రీలంకకు బౌద్ధమతాన్ని పరిచయం చేసిన మహింద యొక్క చెల్లెలు.సంఘమిత్త యువరాణి జీవితాన్ని త్యజించి తన 18 సంవత్సరాల వయస్సులో ఉండగా బౌద్ధ భిక్ఖునిగా మారింది.అదే రోజున సంఘమిత్తా “అరహంతురాలు” అయింది.సంఘమిత్త తనయుడు సుమన సామనేరునిగా మారి తల్లితో ధమ్మ సేవకు తన జీవితాన్ని అంకితం చేసెను.బౌద్ధ భిక్ఖుణి సంఘమిత్తా,భిక్ఖువు మహిందలు సుదూర ప్రాంతాలకువెళ్ళి, భిక్షాటన చేసి జీవిస్తూ ధర్మాన్ని ప్రచారం చేశారు.

బౌద్ధ ధమ్మ వ్యాప్తికి భిక్ఖుణి సంఘమిత్తా శ్రీలంక పయనం:

శ్రీలంక రాజు దేవానామ్ పియతిస్స సంఘమిత్త ను బౌద్ధాన్ని వ్యాప్తి చేయడానికి ఆహ్వానం పంపారు. మహాసామ్రాట్ అశోకుడు శ్రీలంకలో బౌద్ధ ధమ్మం వ్యాప్తి చేయాలనే కోరిక కలిగి ఉన్నారు.అశోకుని తనయుడు మహింద మరియు తనయ సంఘమిత్తలు భిక్షువులుగా మారారు.భిక్ఖుణి సంఘమిత్తా తనతో పాటుగా మరో పది మంది బౌద్ధ భిక్ఖుణిలను వెంటపెట్టుకుని మన దేశ మూల బోధివృక్ష శాఖ(కొమ్మ)ను తీసుకుని జ్యేష్ట పౌర్ణమి రోజునే శ్రీలంకకు పయనమయ్యారు.సంఘమిత్తా శ్రీలంకలోని అనురాధపురానికి తూర్పున ఎనిమిది మైళ్ల దూరంలో ఉన్న “మహింతలే” అనే చోట శ్రీలంక రాజు దేవానామ్ పియతిస్సను జ్యేష్ట పౌర్ణమి రోజునే కలుసుకున్నారు.మూల బోధివృక్ష శాఖను సంఘమిత్తా శ్రీలంకలోని అనురాధపురంలో నాటారు. అక్కడ అనురాధపురం విహార నిర్మించారు.సంఘమిత్తా నాటిన బోధివృక్షం నేటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉంది. ప్రపంచ వృక్షాలలో కెల్లా ఈ బోధివృక్షం అతి ప్రాచీనమైనది.సంఘమిత్తా కూడా శ్రీలంకలోనే ఉంటూ బౌద్ధ ధమ్మాన్ని బోధిస్తూ గడిపింది. శ్రీలంకలో ఎందరో మహిళలకు సంఘమిత్తా భిక్ఖుణిలుగా ఉపసంపదను ఇచ్చి ఎందరినో మహిళలను బౌద్ధ భిక్ఖుణిలను చేసింది. తన 59 వ ఏట భిక్ఖుణి సంఘమిత్తా మమహాపరినిర్వాణం చెందారు.ఆమె అవశేషాలపై శ్రీలంకలో ఒక స్తూపం కూడా నిర్మించారు.సంఘమిత్ర డేఆధ్యాత్మిక నాయకురాలు, ప్రపంచంలోని మొట్టమొదటి పర్యావరణ మహిళా రాయబారి సంఘమిత్ర.ప్రపంచ బౌద్ధులు మార్గశిర పౌర్ణమి రోజున సంఘమిత్ర డే గా జరుపుకుంటున్నారు.శ్రీలంక రాజు దేవనాం పియతిస్సా అశోక చక్రవర్తికి సందేశం పంపాడు, అతని రాజ కుటుంబంలో చాలా మంది మహిళలు సన్యాసం పొందాలనుకుంటున్నారని కావున మా దేశానికి బౌద్ధ భిక్ఖుణిలను పంపించాల్సిందిగా కోరారు. శ్రీలంక రాజు మహింద ద్వారా బౌద్ధం పట్ల ఆకర్షతులయ్యారు.అయితే అశోక చక్రవర్తి తన కూతురిని పంపించే అవకాశం చూసి మొదట కలవరపడ్డాడు. కానీ, సంఘమిత్ర పట్టుదలతో తన తండ్రి మనసు మార్చుకుంది.ఇతర బౌద్ధ సన్యాసినులు (భిక్ఖుణిలు)తో పాటుగా, సంఘమిత్ర క్రీ.పూ.245 సమయంలో, బుద్ధుడు జన్మించిన ప్రదేశంలోని ఉన్న బోధి వృక్షం (ఫికస్ రెలిజియోసా) యొక్క మొక్కను తీసుకుని శ్రీలంకకు వచ్చారు. ఇది అసాధారణమైన, పర్యావరణ బహుమతి.ఆ కాలంలో, పాలకులు బహుమతుల విలాసంగా ఒకరినొకరు మించిపోయారు.దౌత్య బహుమతులు అంటే స్నేహానికి ముద్రలు. శ్రీలంకలో, సంఘమిత్త మరియు ఆమె పరివారాన్ని రాజు దేవనాం పియతిస్సా స్వీకరించారు. ఈ మొక్కను శ్రీలంకలోని అనురాధపురానికి తీసుకువెళ్లారు, అక్కడ అది నేటికీ వర్ధిల్లుతోంది.సంఘమిత్త కుమారుడు సామనేర సుమన కూడా ఆమెతో చేరాడు.శ్రీలంకలో, సంఘమిత్ర మొదటి అంతర్జాతీయ భిక్షుని సంఘాన్ని స్థాపించింది – బౌద్ధ సన్యాసినుల క్రమం, ఇది ఇప్పుడు ప్రపంచంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది.భవతు సబ్బ మంగలమ


అరియ నాగసేన బోధి

M.A.,M.Phil.,TPT.,LL.బి

ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది

You may also like...

Translate »