సత్పురుషులను ఇలా గుర్తించవచ్చు.

భగవాన్ బుద్ధుడు సత్పురుషులను నాలుగు రకాల లక్షణాలు ఆధారంగా గుర్తించవచ్చు అని భిక్షువులకు. ఉపదేశించెను.
1.సత్పురుషులు ఇతరుల దోషాలను గురించి ఎవరైనా అడిగితే వాటిని చెప్పరు.అడగనప్పుడు మరీ తక్కువగా చెబుతారు. ఇక వివరాలు గురించి కనుక అడిగితే దాటవేస్తూ,ఇతరుల గురించి పెద్దగా చెప్పరు.
2.ఇతరుల యొక్క మంచి గుణాలు గురించి అడగకుండానే చెబుతారు. అడిగితే గనుక మరీ ఎక్కువగా చెబుతారు. వివరాలు కోసం ప్రయత్నం చేస్తే పూర్తిగా ఇతరులలోని మంచిని మనకు వివరంగా చెబుతారు.ఇది సత్పురుషులు యొక్క లక్షణం.
3.తమలోని దోషాలను గురించి సత్పురుషులు మనం అడగకుండానే చెబుతారు. ఒకవేళ మనం అడిగితే ఎలాంటి దాపరికం లేకుండా ఇంకా ఎక్కువగా తమలోని దోషాలను బయటకు చెబుతారు.
4.తమలోని మంచి గుణాలను గురించి అడిగినా వాటిని చెప్పరు.అడగనప్పుడు మరీ తక్కువగా చెబుతారు.వివరాలు గురించి గనుక మనం ప్రయత్నం చేస్తే తమలోని మంచి గుణాలను గురించి అరకొరగా చెబుతారు.
ఈ నాలుగు లక్షణాలు సత్పురుషులలో చూడొచ్చు.
-అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రచారకులు & న్యాయవాది
భవతు సబ్బ మంగలమ్