బుద్ధ వందనం

౹౹నమోతస్స భగవతో అరహతో సమ్మాసంబుద్ధస్స౹౹
జీవన్ముక్తుడు పరిపూర్ణ జ్ఞోనోదయడైన భగవాన్ బుద్ధునికి నేను అభివాదన(వందనం లేదా నమస్సులు) చేస్తున్నాను.
భగవతో అనగా భగవాన్ అని అర్థం.బుద్ధునికి గల బిరుదు భగవాన్.భగవాన్ పదానికి అయ్యా, సర్, గౌరవనీయులు అని అర్థం చెప్పుకోవచ్చును.బుద్ధ దేవుడు దొడ్డ గుణములు గల మహామానవీయుడు అందుకే భగవాన్ అని అంటారు.భగవాన్ అనగా భాగ్యవంతుడని కూడా అర్థం గలదు.
అరహతో అనగా అరహంత/అర్హతుడు.అర్హుడు అని అర్థం చెప్పుకోవచ్చు. బౌద్ధ ఋషి, జ్ఞానోదయం పొందిన వాళ్ళని అర్హంతుడు అంటారు. శత్రువులను(క్లేశాలను) అనగా రాగద్వేషాలను, మోహాలనే మానసిక మాలిన్యాలను మట్టు పెట్టిన వారు బుద్ధుడు కావున అరహంత్ అని అంటారు. ఈ సంసారం అనే చక్రాన్ని దాటిన వారు బుద్ధుడు.అరహంత్ అనగా జీవన్ముక్తుడు అని కూడా చెప్పవచ్చును.
సమ్మాసంబుద్ధస్స అనగా సమ్యక్ సంబుద్ధుడు అని అర్థం. అనగా సరియైన ,సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందిన వారు బుద్ధుడు.బుద్ధుడు తన సాధన ద్వారా కఠోర తపస్సు ద్వారా పరిపూర్ణ జ్ఞానాన్ని ఆర్జించారు.అందుకే బుద్ధుణ్ణి పరిపూర్ణ జ్ఞానోదయడు అని అంటారు.
బౌద్ధులు విధిగా పైన చెప్పిన వందన వాక్యాన్ని మనసా, వాచా,కాయేనా సూచించేందుకు మూడు సార్లు పలుకుతారు.ఈ మూడు పదాలు బుద్ధుని పట్ల భక్తిని, గౌరవాన్ని ప్రకటిస్తాయి.

— అరియ నాగసేన బోధి
M.A.,M.Phil.,TPT.,LL.B
ధమ్మ ప్రబోధకులు & న్యాయవాది