కెరీర్ ను ఎలా ఎంపిక చేసుకోవాలి?

Source|Digital Vidya

ప్రస్తుత పరిస్థితులలో ప్రతి విద్యార్థి చదువుకునే దశలో తీసుకోవలసిన నిర్ణయాలలో అత్యంత కీలకమైన నిర్ణయం మరియు ప్రశ్నించుకోవలసిన అంశం. నేను నా జీవితంలో ఏ కెరీర్లను ఎంచుకోవాలి? ఎందుకనగా మీరు ఎంచుకున్న కెరీర్ (లేదా) కోర్సు మీ యొక్క జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే చాలా మంది విద్యార్థులు ఏలాంటి అవగాహన లేకుండా తనకు సంబంధించని కెరీర్ను ఎంచుకుంటున్నారు. దీనివల్ల వారి కెరీర్లో ఉన్నత స్థాయికి చేరుకోలేక నిరాశ – నిస్పృహలకు లోనవుతూ జీవితంలో అనేక రకాల ఒత్తిళ్లకు గురవుతున్నారు.

కాబట్టి విద్యార్థి తనకు సరియైన కెరీర్ను ఎంచుకోవడమే తన జీవితంలో ముఖ్యమైన అంశము.

ఆసక్తి (Interest):

మీరు కెరీర్ ఎంచుకోవడంలో ఆసక్తి అనేది అతి ముఖ్యమైన అంశం. మీరు ముందుగా మీకు నచ్చిన రంగాన్ని గుర్తించాలి. మీకు ఎలాంటి పనులు చేస్తే మీరు ప్రతిరోజు సంతోషంగా ఉంటారో దానికి అనుగుణంగా మీ కెరీర్ను ఎన్నుకోవాలి. మనం ఏ పని చేస్తే ఆనందంగా మరియు సంతోషంగా ఉంటామో దానిలో మనం అత్యంత ప్రతిభ కనబరుస్తాము. మరియు మనం చేసే పనిలో కొత్త విషయాలు సులభంగా నేర్చుకోవచ్చు. తద్వారా మీ యొక్క ఆత్మవిశ్వాసం మరియు మీరు చేసే ఉద్యోగంలో సంతృప్తి ఉంటాయి. మీరు పనిచేసేటపుడు మీ యొక్క పని ఆనందంగా ఉండాలి కాని అందోళనకరంగా కాదు.

నైపుణ్యం (Aptitude):

ఇది సహజమైన ప్రతిభ / ప్రజ్ఞను / అనుభవ పూర్వకంగా, చదువుతోపాటు (లేదా) శిక్షణ ద్వారా వస్తుంది. మనలో కొందరు అనర్గలంగా మాడ్లాడగలరు. మరికొందరు గణితం లెక్కలు బాగా చేయగలరు. మరికొందరు అద్భుతంగా ఊహాశక్తిని కలిగి ఉంటారు. నైపుణ్యం ప్రతి ఒక్కరికి వేరు వేరు స్థాయిలో ఉంటుంది. మీరు మీయొక్క నైపుణ్యాన్ని గుర్తించాలి. (ఉదా: Verbal, Numerical, Reasoning, Spatial)., మీయొక్క నైపుణ్యానికి తగిన కెరీర్ను ఎంచుకోవాలి.

వ్యక్తిత్వం (Personality):

ఆసక్తి మరియు నైపుణ్యంతో పాటు మన సహజ సామర్ధ్యం మరియు వ్యక్తిత్వం చాలా కీలకమైనది. మన వ్యక్తిత్వం విధి నిర్వహణ. జీవన విధానం, మరియు పరిస్థితుల, సంఘటనల వలన తెలుస్తుంది.

ఉదాహరణ:-

మీకు టీచర్ వృత్తి అంటే అమితమైన ఆసక్తి మరియు మీకు మంచిగా మాట్లాడే నైపుణ్యం కూడా ఉంది. కానీ మీకు తొందరగా కోపం వస్తుంది మరియు పిల్లలతో కలిసి పని చేయడానికి ఇష్టపడరు. అయితే మాటి మాటికి కోపం వచ్చే స్వభావం/ వ్యక్తిత్వం ఉన్నవారు మంచి టీచర్ కాగలరా? ప్రత్యామ్నయంగా మీరు శాంత స్వభావం మరియు కలిసి పనిచేయడానికి ఇష్టపడితే, మీరు ఒక మంచి టీచర్ కాగలరు. ఎందుకంటే మీ ఆసక్తి, నైపుణ్యంతో పాటు మీయొక్క వ్యక్తిత్వం సరిగ్గా సరిపోతుంది.

సాధారణ అనుకూల పరిస్థితులు (Practical Applicability):

మన నిజ జీవితంలో పరిస్థితులకు అనుగుణంగా మన యొక్క కెరీర్ను ఎంచుకోవడం వలన మనకు ఎలాంటి సమస్యలు ఉండవు,

ch ఆర్థిక పరిస్థితులు

ప్రాంతం (ఉదా: ఉన్నత విద్య (లేదా) ఉద్యోగం సుదూర ప్రాంతంలో చేయడం.. వార్షిక విద్యా ప్రతిభ ( ఉదా: మార్కులు, పర్సంటేజ్, గ్రేడ్)

అవకాశాలు (Opportunities):

చివరిది అతి ప్రాముఖ్యమైనది.. ఉద్యోగ అవకాశాలు తెలుసుకోవడం. దీనికోసం ప్రస్తుత పరిస్థితులతో పాటు, భవిష్యత్తు మార్పులకనుగుణంగా వివిధ రంగాలలో లేదా పరిశ్రమలలో పెరుగుతున్న మరియు తగ్గుతున్న ఉపాధి అవకాశాల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. ఈరోజు ఉన్నటువంటి మెరుగైన ఉపాధి అవకాశాలు రేపు కనుమరుగు అయిపోవచ్చు. అనవసరంగా భావించే ఉద్యోగాలు భవిష్యత్తులో అత్యవసరం కావచ్చు.

జీవన ప్రమాణాలకు అనుగుణంగా మరియు మారుతున్న జీవనశైలి ప్రకారం కొత్త ఉద్యోగాలు పెరుగుతాయి. అందుకని అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. దానికి తగిన సమాచారం. కౌన్సిలర్ల సూచనలు మరియు వార్తాపత్రికలు, ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవాలి. ఒకసారి మీయొక్క కెరీర్ను నిర్ణయించుకున్న తరువాత మీయొక్క ప్రథమ లక్ష్యం మరియు ధీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రణాళికను

వేసుకుంటూ ముందుకు సాగాలి.

ఒక రాకెట్ ప్రయోగానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఆ రాకెట్ ప్రయాణించడం మొదలుపెట్టి అది లక్ష్యాన్ని చేరుకున్న తరువాత దానికి నిర్దేశించిన మార్గంలో ప్రయాణిస్తుంది. అలాగే మీరు కూడా మీ లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తరువాత ముందుకు సాగిపోతూ ఉండాలి.

You may also like...

Translate »