కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య.?

కాంగ్రెస్ గూటికి చేవెళ్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే యాదయ్య..?

కాంగ్రెస్ పార్టీ లోకి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య?

ఇప్పటికే చేవెళ్లలో ని, బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక

ఇప్పుడు ఏకంగా చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ను టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీ, సుముఖత వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ?

జ్ఞాన తెలంగాణ, శంకర్ పల్లి : బి ఆర్ ఎస్ పార్టీ నాయకుడు చేవెళ్ల శాసనసభ ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వక భేటీ అని, చెబుతున్నప్పటికీ మరో నెల రోజుల్లో, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న వేళ, ఇదే మర్యాద అని, బి ఆర్ ఎస్ పార్టీ శ్రేణులు ,అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే, రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో, చేవెళ్ల గడ్డ పైన పార్లమెంటు స్థానాన్ని గెలిచి, చేవెళ్ల గడ్డ కాంగ్రెస్ అడ్డగా, మలుచుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం, శతవిధాల ప్రయత్నిస్తుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లో, కీలకమైన నేతల ద్వారా కార్యాచరణ వేగవంతమైనట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఏకంగా సిట్టింగ్ ఎమ్మెల్యే కాలె యాదయ్య పై గురిపెట్టి , కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి, రేవంత్ రెడ్డి గురి పెడితే, టార్గెట్ మిస్ కాదని, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తున్నది. ఇదే నిజమైతే మరో రెండు మూడు రోజుల్లో, కాలె యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరడం, లాంచనమే అని, కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

You may also like...

Translate »