ఆచార్య వినోబాభావే భూదాన్ పోచంపల్లి ఉద్యమం చారిత్రక నేపథ్యంఆచార్య వినోభాభావే

, 20వ శతాబ్దంలో భారతదేశంలో అత్యంత ప్రభావంతమైన సామాజిక ఆధ్యాత్మిక నాయకులలో ఒకరు. పల్లెల జీవనం చూసి కన్నీళ్లు పెట్టుకొని, భూమి శ్రీమంతుల చేతుల్లో ఉండిపోయిందని భావించి. భూమిని పేదలకు పంచి న్యాయం చేయాలని ఆలోచన వచ్చిన వినోబాభావే భూదానోద్యమాన్ని ప్రారంభించాడు. భారతదేశ స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక సంస్కర్త, మరియు ఆధ్యాత్మికవేత్త, భూమి హక్కుల కోసంపోరాడినందుకు ప్రసిద్ధి చెందిన ఆచార్య వినోబాభావే 1895లో మహారాష్ట్రలో జన్మించారు. ఆయన చిన్నతనంలోనే ఆధ్యాత్మికత మరియు సామాజిక సేవ పట్ల ఆకర్షతులయ్యారు. గాంధీజీ యొక్క ఆలోచనలకు ప్రభావితుడై భారత స్వతంత్ర ఉద్యమంలో చేరారు. 1947 స్వతంత్రం తర్వాత గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టారు. సామాజిక సంస్కరణలపై పోరాటం చేశారు. భారతదేశంలో భూమి హక్కులు ఎప్పుడు ఒక ప్రధాన సమస్యగా ఉంది. స్వాతంత్రం తరువాత కూడా చాలామంది భూమిలేని వారు ఉన్నారు. పెద్ద భూస్వాములు చాలా భూమిని కలిగి ఉన్నారు. ఈ అసమానతులను పరిష్కరించటానికి ఆచార్య వినోబాభావే1951, లో ఏప్రిల్ 18వ తేదీన , భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు, దీని ద్వారా భూమి యజమానులు తమ భూమిలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా దానం చేశారు, ఆ భూమిని భూమిలేని పేదలకు పంపిణీ చేశారు. ఈ ఉద్యమం యొక్క ఒక ముఖ్యమైన మైలురాయి 1951లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో పోచంపల్లి గ్రామంలో ప్రారంభించారు. అక్కడ ఆచార్య భావేభా వే ఒక భూస్వామి రామచంద్రారెడ్డి తనకున్న 3500 ఎకరాల భూమిలో మొదటగా 100 ఎకరాల భూమిని దానం చేయడానికి ఒప్పించారు. ఆ తరువాత 800 ఎకరాల భూమిని దానంగా ఇచ్చాడు. ఈ భూమిని భూమిలేని కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ భూమి పంపిణీలో భాగంగా మొదటగా మైసయ్య అనే వ్యక్తి భూమిని దానంగా పొందాడు. ఆ తర్వాత హైదరాబాద్ సంస్థానం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వ్యక్తిగత ఆస్తి 14 వేల ఎకరాల భూమిని భూదానోద్యమానికి దాసించాడు. నల్లగొండ జిల్లాలో కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు ఎక్కువగా ఉండటం, పేద రైతులకు ఈ ఉద్యమం నాయకులు సహకరించటం పోచంపల్లి భూదాన ఉద్యమం భారత దేశంలో అత్యంత ప్రభావంతంగా మారింది. పోచంపల్లి భూదాన్ ఉద్యమం భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో ఇలాంటి ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చింది.
ఆచార్య వినోభా భావే సర్వోదయ సమాజాన్ని స్థాపించి ఈ సంస్థ ద్వారా1951 లో భూదాన్ ఉద్యమాన్ని ప్రారంభించారు.ఈ ఉద్యమం యొక్క ప్రాథమిక లక్ష్యం భూమి యజమానులను తమ భూమిలో కొంత భాగాన్ని స్వచ్ఛందంగా దానం చేయడానికి ఒప్పించడం. ఈ భూమిని భూమిలేని పేదలకు పంపిణీ చేశారు.వారికి స్వంత భూమిని కలిగి ఉండే అవకాశం కలిగించారు. గ్రామ స్వరాజ్యం, సమానత్వం, సామాజిక న్యాయం, భూ యాజమాన్య హక్కు ఒక సామాజిక బాధ్యతగా భావించి భూదాన్ పోచంపల్లి ఉద్యమాన్ని ప్రారంభించారు.
పోచంపల్లి భూదాన్ ఉద్యమం భారతదేశ చరిత్రలోఒక మైలురాయి.
పోచంపల్లి, తెలంగాణలోని ఒక చిన్న గ్రామం, ఈ గ్రామంలో భూదాన్ ఉద్యమం 1951 లో, ఆచార్య వినోభాభావే ప్రారంభించిన గమనార్హం. భూదానోద్యమం దేశవ్యాప్తంగా భూమిని దానం చేయటానికి ప్రజలను ప్రోత్సహించారు. భూదాన్ యజ్ఞం అని పిలవబడే ఒక ప్రచారాన్ని నిర్వహించారు దీని ద్వారా లక్షలాది ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంపిణీ చేశారు. బోధన ఉద్యమం భారత దేశంలో భూమి సంస్కరణలకు ఒక ముఖ్యమైన మలుపును సూచించింది. లక్షలాది మంది పేదలకు భూమి యాజమాన్యం హక్కు లభించింది. దీనివల్ల భూమిలేని పేద ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి సామాజిక న్యాయానికి ఈ ఉద్యమం ఒక ప్రేరణగా నిలిచింది. భూదాన ఉద్యమం ద్వారా భారత దేశ ప్రజలలో దాన గుణం త్యాగ గుణం సహాయ సహకారం వంటి అంశాలలో భారతదేశ గ్రామీణ ప్రాంతాలు అత్యంత అభివృద్ధి కరమైన మార్పు వచ్చింది. వినోద్ బాబాయ్ ఒక మార్గదర్శకుడు భారతదేశంలో సామాజిక న్యాయం కోసం పోరాటం చేసిన ఒక మహనీయుడు. ఒక గొప్ప ఆచార్యుడు ఆయన ఆశయాలు నేటికి ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.

కవి, సాహితీ విశ్లేషకులు
పూసపాటి వేదాద్రి

You may also like...

Translate »