యువకులు క్రీడలతో పాటుగా ఉద్యోగ సాధనలో రాణించాలని కడ్తాల్ మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి అన్నారు. కడ్తాల్ మండల కేంద్రంలో గత మూడు రోజుల నుండి జరుగుతున్న ఐక్యత క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ క్రీడలు స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు.అదేవిధంగా క్రీడలతోపాటుగా యువకులు ఉద్యోగ సాధన కొరకు కష్టపడి చదువుకోవాలని సూచించారు. అనంతరం టోర్నమెంట్ లో విజయం సాధించిన ప్రధమ,ద్వితీయ జట్లకు బహుమతులు అందజేశారు. టోర్నమెంటుకు ప్రత్యక్షంగ, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి మరియు ఆర్గనైజర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు బిక్షపతి ముత్తి కృష్ణ, సిద్దిగారి దాసు, కొప్పు కృష్ణ, మంకీ మహేష్ ముసలి మహేష్, గురిగల్ల కృష్ణ, సిద్ధిగారి వెంకటేష్, కంబాలపల్లి అంజి, మంకీ శ్రీకాంత్, సిద్ధిగారి రాజా,వగ్గు మహేష్, కంబలపల్లి శ్రీకాంత్,మొగిల్ల మహేష్, సిద్దిగారు సురేష్.వాగ్గు రమేష్, కొప్పు వేణు మూత్తి రెను,కలే మహేష్, నరేష్, మధు, అర్రోల మహేష్, మణికంఠ ముత్యాల శంకర్ సిద్దిగారి,కరుణాకర్, మురళి,శివ, టిల్లు, రాఘవ తదితరులు పాల్గొన్నారు.