వైన్స్ వద్ద యువకులు హల్చల్..

జ్ఞాన తెలంగాణ సిద్దిపేట జిల్లా ప్రతినిది ఏప్రిల్ 29.

సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని మెట్టు వద్ద ఉన్న వైన్స్ దగ్గర ఆదివారం కొంత మంది యువకులు బీర్ల కోసం హల్చల్ చేశారు. స్టాక్ లేదని చెప్పినా వినకుండా వైన్ సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు.వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వైన్స్ వద్దకు వచ్చిన పోలీసులు యువకులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు వినలేదు. పైగా పోలీసులతో దురుసుగా మాట్లాడుతూ దాడికి యత్నించారు. దీంతో పోలీసులు కొందరు యువకులను అదుపులోకి తీసుకొని తొగుట పోలీస్స్టేషన్కు తరలించారు. మరికొందరు యువకులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. దాడికి ప్రయత్నించిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ లింగం చెప్పారు.

You may also like...

Translate »