క్రీడలతో ప్రతి ఒక్కరూ ప్రపంచ స్థాయి గుర్తింపును పొందవచ్చు అని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.వారు మంగళ వారం రోజు గోపాల్ పేట్ మండల కేంద్రంలోనీ ఏదుట్ల గ్రామంలో నిర్వహించిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీల ప్రారంభాన్ని యువకులతో కలసి వాలీబాల్ ఆడి ప్రారంభించారు.వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం క్రీడల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టి సారించిందనీ యువకులు క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తల్లిదండ్రులను సైతం గౌరవిస్తూ,పుట్టిన ఊరికి,దేశానికి మంచి పేరు తీసుకురావాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ క్రీడాకారులు, గోపాల్ పేట్, రేవల్లి మండలాల నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.