కార్మికుల హక్కులను కాలరాస్తే సహించం

బిఎస్పీ మహిళ జిల్లా కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్
కార్మికుల హక్కులను కాలరాస్తే సహించబొమని బహుజన్ సమాజ్ పార్టీ మహబూబాబాద్ జిల్లా మహిళ కన్వీనర్ గుగులోత్ పార్వతి రమేష్ నాయక్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ అసెంబ్లీ దంతాలపల్లి మండలకేంద్రంలో అంగన్వాడీ కార్మికుల సమ్మె ఎనమిదిరోజులకు చేరిన సందర్బంగా బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పాల్గోని దీక్షకు తమ సంఘీభావం, పూర్తి మద్దతును తెలిపారు. ఈసందర్బంగా పార్వతి రమేష్ నాయక్ మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గత టిడిపి ప్రభుత్వం అంగన్వాడీల ను గుర్రాలతొ తొక్కించి లాఠీలతో కొట్టించి హింసించిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణలొ ఉనికి లేకుండా పొయిందని నేడు జైలులొ చిప్పకూడు తింటున్నాడని తెలంగాణ లొ బిఆరెస్ ప్రభుత్వం మళ్ళీ అధికారంలొకి వస్తే గ్రామపంచాయతీ సిబ్బందికి, కాంట్రాక్టు, ఔట్సోరిసింగ్, అంగన్వాడీ ఉద్యోగులను ఒక్క సంతకంతో పర్మినెంట్ చేస్తామని ప్రగల్బాలు పలికి నేడు అదే కేసీఆర్ హామీలను అమలుచేయకుండ రోడ్డున పడేసే ప్రయత్నం చేస్తున్నాడని చంద్రబాబు నాయుడు కు పట్టిన గతే కేసీఆర్ కు తెలంగాణలొ పడుతుందని అన్నారు. కేసీఆర్ మెడలు వంచి హక్కులను సాధించేవరకు ఆగేది లేదని తెలిపారు. బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ముఖ్యమంత్రి అభ్యర్థి డాక్టర్ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అంగన్వాడీ కార్మికుల సమ్మెకు మద్దత్తు తెలిపారని తాము అధికారంలొకి వస్తే మొదటి సంతకంతోనే అన్ని రంగాల్లో వివిధ హోదాల్లో పనిచేసే కార్మికులందరిని పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని దొరల పాలనను అంతమోందించి సమిష్టిగా బహుజన రాజ్యం తెచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలొ బిఎస్పీ జిల్లా కార్యదర్శి, డోర్నకల్ అసెంబ్లీ ఇంచార్జ్ ఐనాల పరశురాములు, లంబాడిల ఐక్యవేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయ కర్త గుగులోత్ రమేష్ నాయక్,బిఎస్పీ జిల్లా ఇసి మెంబర్ ఎడ్ల శ్రీను, బిఎస్పీ డోర్నకల్ అసెంబ్లీ మహిళ కన్వీనర్ దర్శనాల మమత, మరిపెడ మండల ప్రధాన కార్యదర్శి గుగులోత్ బాసునాయక్, అంగన్వాడీ ల యూనియన్ మండల అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల రమాదేవి, దుండి మంగమ్మ, మండల నాయకులు మంజుల, విజయలక్ష్మి, పంతం వెంకటలక్ష్మి, బుర్ర ఉపేంద్ర, స్వరూప, జ్యోతి, నర్మదా, రజిత తదితరులు పాల్గొన్నారు