12% రిజర్వేషన్ సాధనకై జూన్ 7న మాదిగల జనసభను జయప్రదం చేయండి:: మాదిగ జే.ఏ.సి. జనరల్ సెక్రటరీ:- మోదుగు.జోగారావు

12% రిజర్వేషన్ సాధనకై జూన్ 7న మాదిగల జనసభను జయప్రదం చేయండి:: మాదిగ జే.ఏ.సి. జనరల్ సెక్రటరీ:- మోదుగు.జోగారావు
జ్ఞాన తెలంగాణ భద్రాద్రి/కొత్తగూడెం న్యూస్:ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని మేదర్ బస్తీలో మాదిగ జే.ఏ.సి. జిల్లా అధ్యక్షులు గద్దల.రమేష్ తో కలిసి మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర జనరల్ సెక్రటరీ మోదుగు.జోగారావు ముఖ్యనాయకుల సమావేశంలో మాట్లాడుతూ మాదిగ జే.ఏ.సి.వ్యవస్థాపకులు పిడమర్తి.రవి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 7 నుంచి మాదిగలకు 12% రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా జరుగుతున్న మాదిగల జనసభను జయప్రదం చేయాలని కోరారు.డా.పిడమర్తి.రవి, భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ మండల కేంద్రంలో జూన్ 7న ముఖ్య అధితి విచ్చేయుచున్న మాదిగల జనసభకు జిల్లాలోని మాదిగలు,మాదిగ జే.ఏ.సి.నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాయకులను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు అనిల్,కిషోర్,నరసింహారావు,గోపాల్,పెద్దయ్య,మహేష్,కుమార్ తదితరులు పాల్గొన్నారు