స్థానిక సంస్థల ఎన్నికలపై ఆ ప్రకటనలు ఏంటి?!!’

-మంత్రి పొంగులేటిపై టీపీసీసీ చీఫ్​ ఆగ్రహం..

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్ ​గౌడ్​ ఫైర్​ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటన చేయడంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్​కుమార్​ గౌడ్​ అసంతృప్తి వ్యక్తం చేశారు. రిజర్వేషన్లతో ముడిపడిన అంశంపై ముందస్తు ప్రకటన సరికాదని హెచ్చరించారు. కేబినెట్​లో చర్చించకుండానే ముందుగా ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. ఒకరి మంత్రిత్వ శాఖ అంశంపైన మరొకరు మాట్లాడటం ఏంటని అన్నారు. కోర్టు పరిధిలో ఉన్న అంశాలపై మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పార్టీతో సంప్రదించకుండా అలాంటి ప్రకటనలు చేయవద్దని అన్నారు. మంత్రులు వారి శాఖల పరిధిలోని అంశాలను మాత్రమే మాట్లాడాలని మహేశ్ కుమార్ గౌడ్ సూచించారు.

You may also like...

Translate »