ఏపీలో మా మద్దతు జగన్ కే: అసదుద్దీన్

May 02, 2024,

ఏపీలో మా మద్దతు జగన్ కే: అసదుద్దీన్
ఏపీలో తమ మద్దతు సీఎం వైఎస్ జగన్ కేనని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. ఆంధ్రలో టీడీపీ-జనసేన కూటమిలో నటులు ఉంటే.. దేశంలోనే మహానటుడు మోదీ అన్నారు. మోదీని ప్రశ్నించే దమ్ము చంద్రబాబుకు లేదని, ప్రధానిని ఢీకొట్టే సత్తా జగన్ కే ఉందన్నారు. చంద్రబాబు గెలిస్తే మోదీ చేతిలో కీలుబొమ్మగా మారతారని, జగన్ సీఎంగా ఉంటే ఏపీలో మైనార్టీ హక్కులను పరిరక్షిస్తారని అన్నారు. అందుకే ఏపీలోని ప్రజలు జగన్ కే ఓటేయాలని ఆయన కోరారు.

You may also like...

Translate »