ఓటు వజ్రాయుధం లాంటిది.. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి

ఓటు వజ్రాయుధం లాంటిది.. ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి
సెక్టర్ అధికారి డాక్టర్ పరశురాములు
జ్ఞాన తెలంగాణ (హైదరాబాద్ న్యూస్) ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల సెక్టర్ అధికారి డాక్టర్ పరశురాములు తెలిపారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లోని మంగళవారం ఆర్డిఓ ఏ ఈ ఆర్ ఓ సూచనల మేరకు సెక్టార్ నెంబర్ 21 లో సెక్టర్ అధికారి ఆధ్వర్యంలో 203,204,205, 207, 208,225,226,227,228,
229,230,231 పోలింగ్ స్టేషన్లలో చేవెళ్ల లోక్ సభ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించిన ఓటర్ స్లిప్స్ బూత్ లెవెల్ అధికారుల ద్వారా పంచడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా సెక్టార్ అధికారి డాక్టర్ పరిశురాములు మాట్లాడుతూ ఓటు హక్కు ప్రతి ఒక్కరు సద్వినియం చేసుకోవాలన్నారు . ఓటర్ల చైతన్య పరుస్తూ ఎన్నికల్లో ఓటు యొక్క విలువ ను తెలియజేశారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో, రూట్ ఆఫీసర్ హరికృష్ణ, బూత్ లెవెల్ అధికారులు నవనీత, స్వప్న రాణి, యాదగిరి, చంద్రయ్య, అరుణ,నవ్య శ్రీ, ప్రకాష్, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు..
