ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి

ప్రశ్నించే గొంతుకకు పట్టం కట్టాలి

బుద్దుల సునీత
తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు
జ్ఞాన తెలంగాణ భువనగిరి మే 10.

ఉమ్మడి వరంగల్, ఖమ్మం నల్గొండ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కొరకు ప్రజలు, విద్యార్థులు , మేదావులు,ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలని తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యురాలు బుద్దుల సునీత కోరారు. శుక్రవారం ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ను మర్యాదపూర్వకంగా కలిసిన తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు కలిసి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని ఆయనను కోరారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారని ఆమె అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీ ఆర్ ఎస్ ను నామరూపం లేకుండా చేయుటకు నిరంతరం తన గలంతో “క్యూ న్యూస్” వేదికగా తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాలు పొందిన తీన్మార్ మల్లన్న ను చట్టసభలకు పంపించే భాద్యత మనందరిపై ఉందని ఆమె అన్నారు. తెలంగాణలోని విద్యార్థులు ,మేధావులు, ఉపాధ్యాయులు, రిటైర్ ఉద్యోగులు, ప్రతి ఒక్కరూ ఈనెల 27 న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటుగా తీన్మార్ మల్లన్న కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యుడు రమేష్ యాదవ్,తీన్మార్ మల్లన్న టీం యాదాద్రి మండల అధ్యక్షులు పుప్పాల నరేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

You may also like...

Translate »