జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో విశ్రా విద్యార్థుల ప్రభంజనం

జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో విశ్రా విద్యార్థుల ప్రభంజనం
కళాశాల డైరెక్టర్ హరిహారనాథ్ శర్మ
జ్ఞాన తెలంగాణ, (బాలాపూర్)
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో బాలాపూర్ విశ్రా జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ హరిహారనాథ్ శర్మ మాట్లాడుతూ జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో మా కళాశాల విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తూ ఉత్తమ ర్యాంకులు సాధించారని తెలిపారు. ఉత్తమ ఆల్ ఇండియా ర్యాంకులు సాధించిన వి భాను ప్రకాష్ నాయక్-29 ర్యాంకు, జి శ్వేత-ర్యాంకు-1230,ఎం శృతి ర్యాంకు- 1569, వై శివాని ర్యాంకు- 5054,భాను ప్రకాష్ ర్యాంకు- 7049,కాసు కసి తనీష్ ర్యాంకు-10561 సాధించారని పేర్కొన్నారు. ఈ ర్యాంకులు ఒకే బ్రాంచ్ నుండి కేవలం 150 మందిలోనే 6ర్యాంకులు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. మా కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో ఒత్తిడి లేని విద్యా బోధన ఉన్నందున వల్లనే ఇది సాధ్యం అయ్యిందని, అధ్యాపకులు, విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో విద్యాభ్యాసం చేస్తున్నందుకు గర్విస్తున్నామని అనందం వ్యక్తం చేశారు. ఉత్తమ ఫలితాలకు కారణమైన అధ్యాపకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులను సన్మానిస్తూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
