వినోద్ కుమార్ గారిని భారీ మెజారిటీ తో గెలిపించండి

జ్ఞాన తెలంగాణ:రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం రహీంఖాన్ పేట గ్రామంలో కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఇల్లంతకుంట మండల వైస్ ఎం.పి. పి సుదగోని శ్రీనాథ్ గౌడ్ ఈ సందర్బంగా శ్రీనాథ్ గౌడ్ మాట్లాడుతూ కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు పార్లమెంట్ లో ప్రశ్నించే గొంతు వినోద్ కుమార్ అని అన్నారు 2014 నుండి 2019 వరకు 102 చర్చల్లో 550 కి పైగా అత్యధిక ప్రశ్నలు అడిగిన వ్యక్తి వినోద్ కుమార్ అని అన్నారు కరీంనగర్ కి స్మార్ట్ సిటీ తెచ్చి వెయ్యి కోట్ల రూపాయలతో కరీంనగరాన్ని అభివృద్ధి చేసింది వినోద్ కుమార్ అని అన్నారు కరీంనగర్ చుట్టూ జాతీయ రహదారులను తీసుకు వచ్చింది వినోద్ కుమార్ అని అన్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ని అన్ని విధాల అభివృద్ధి చేసే నాయకుడు వినోద్ కుమార్ అని అన్నారు పని చేసే నాయకుడినే ప్రజలు ఎన్నుకోవాలని కోరారు ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ బిలవేణి పర్శరాములు, గ్రామ శాఖ అధ్యక్షులు ఏనుగుల పర్శరాములు, నాయకులు బుచ్చిరెడ్డి, గాదె కనుకయ్య, కొమ్ము కనకయ్య, దాము అంజయ్య, చంద్రయ్య పాల్గొన్నారు.

You may also like...

Translate »