కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన శంకరపల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్
జ్ఞానతెలంగాణ,శంకర్ పల్లి :
మోకిల తండా యువజన నాయకులు వర్థ్య బాబు నాయక్ జన్మదినం సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మోకిల తాండ నందు మొక్కలు నాటే కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా శంకరపల్లి ఎంఈఓ సయ్యద్ అక్బర్ ఎంఈఓ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా వర్థ్య బాబు నాయక్ ఆలోచనను అభినందించారు పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు.మొక్కలను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించాలని అన్నారు. గ్రామంలోని యువజన సంఘ సభ్యులు మొక్కలు నాటే కార్యక్రమంలో చురుకుగా పాల్గొన్నారు. విద్యార్థుల కు పుట్టిన రోజు సందర్బంగా మిఠాయిలు పంచిపెట్టారుబాబు నాయక్. కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పండుగ వాతావరణంలో ఆనందోత్సవాల మధ్య ఇట్టి కార్యక్రమం జరిగింది.